Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత
157 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్
Umran Malik : ఐపీఎల్ 2022లో మోస్ట్ ఫాస్టెస్ట్ బౌలర్ గా జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ పేరొందాడు. ఈసారి సీజన్ లో భారీ ధరకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. మాజీ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik) పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
బౌలింగ్ అంటే స్పీడ్ గా బంతులు వేయడం కాదని కంటిన్యూగా కంట్రోల్ లో బంతుల్ని వేయడమని పేర్కొన్నాడు. అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని పలువురు తాజా, మాజీ క్రికెటర్లతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సూచించడం విశేషం.
ఇదిలా ఉండగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది.
ఉమ్రాన్ మాలిక్(Umran Malik) బౌలింగ్ చేసినప్పటికీ ఢిల్లీ ప్లేయర్లను కట్టడి చేయలేక పోయాడు. వార్నర్ 92 రన్స్ చేస్తే రోవ్ మాన్ పావెల్ దంచి కొట్టారు. 12 ఫోర్లు 3 సిక్సర్లు బాదారు. ఇదే సమయంలో అత్యంత వేగవంతంగా బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్.
ఏ బౌలర్ ను ఢిల్లీ బ్యాటర్లు వదిలి పెట్టలేదు. హైదరాబాద్ పేసర్ అత్యంత వేగవంతమైన బంతిని విసిరి రికార్డు నమోదు చేశాడు. 157 కిలోమీటర్ల స్పీడ్ డెలివరీ వేశాడు.
గతంలో ఆడిన మ్యాచ్ లలో ఉమ్రాన్ మాలిక్ సగటు బంతుల వేగం 153. కానీ అది నాలుగుకు హెచ్చింది. అయితే రోవ్ మాన్ చితక్కొట్టాడు ఉమ్రాన్ మాలిక్ బంతుల్ని. ఈ సీజన్ లో 10 మ్యాచ్ లలో 15 వికెట్లు తీశాడు.
Also Read : David Warner : డేవిడ్ వార్నర్ వరల్డ్ రికార్డ్