Saudi Prince : నిన్న తిరస్కరణ నేడు అభినందన
ఎలోన్ మస్క్ కు యువరాజు బాసట
Saudi Prince : వ్యాపారంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది వాస్తవం. ఎందుకంటే ధనవంతులు, వ్యాపారుల తీరు ఒకేలాగా ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కడున్నా వారి లక్ష్యం ఒక్కటే. సంపాదించడం. ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే దానికి పదింతలు రావాలని కోరుకుంటారు. అదే లోకమంతటా పేదలు, ధనికులు అన్న వర్గాలుగా చీలి పోయేలా చేస్తోంది.
తాజాగా సోషల్ మీడియాను శాసిస్తూ వచ్చిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ కొనుగోలు చేశారు. ఇంకో ఆరు నెలలైతే ఆ సంస్థ తన ఆధీనంలోకి పూర్తిగా వచ్చేంది.
దానిని ఏకంగా 44 బిలియన్లకు చేజిక్కించుకుని అందరినీ విస్తు పోయేలా చేశాడు. ఇప్పటికే ఆయన కొట్టిన దెబ్బకు చాలా మంది కుదేలయ్యారు. మస్క్ ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తాడో ఇంకెవరిని నెత్తికి ఎక్కించు కుంటాడో చెప్పడం కష్టం.
ఎందుకంటే ఆయన స్వభావమే అంత. ఇదిలా ఉండగా విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి మీరు కూడా షేర్లు కొనుగోలు చేయవచ్చంటూ బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, ఔత్సాహికులకు ఆఫర్ ఇచ్చాడు మస్క్.
దీనికి సంబంధించి సౌదీ అరేబియా యువ రాజు అల్వలీద్ బిన్ తలాల్(Saudi Prince) మొదట తిరస్కరించాడు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మస్క్ ను అభినందనలతో ముంచెత్తడం విస్తు పోయేలా చేసింది.
వెంటనే ఆయన స్వరం మార్చేశారు. ఎలోన్ మస్క్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీంతో యువరాజు(Saudi Prince) పెట్టుబడులు పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read : అంకుర సంస్థలకు కేంద్రం సహకారం