Satheesh Reddy : అంకుర సంస్థ‌ల‌కు కేంద్రం స‌హ‌కారం

డీఆర్డీఓ చైర్మెన్ స‌తీష్ రెడ్డి

Satheesh Reddy  : కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే వారికి , అంకురాల‌కు కేంద్రం స‌హ‌కారం అందిస్తోందంటూ స్ప‌ష్టం చేశారు దేశ రక్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ -డీఆర్డీఓ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి.

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశాన్ని అగ్ర‌గామిగా నిల‌పాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్ర‌ద‌ర్శ‌ను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్బంగా స‌తీష్ రెడ్డి మాట్లాడారు. ప్ర‌పంచం లోనే అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అర్జున్ యుద్ద ట్యాంకు త‌యారు చేశామ‌ని చెప్పారు. ఇక ఖ‌గోళ రంగంలో అమెరికా, చైనా , ర‌ష్యాల‌తో ఇస్రో పోటీ ప‌డుతోంద‌ని చెప్పారు.

చంద్రుడు, అంగార‌క గ్ర‌హంపై ప‌రిశోధ‌న‌ల‌కు చంద్ర‌యాన్, మంగ‌ళ యాన్ ల‌ను చేప‌ట్టామ‌ని తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేకూర్చేలా ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ‌యో డీగ్రేడ‌బుల్ బ్యాగ్ ల‌ను డీఆర్డీఓ సంచుల‌ను త‌యారు చేసింద‌ని వెల్ల‌డించారు.

ఈ ప‌రిజ్ఞానాన్ని ఉచితంగా అంద‌జేస్తామ‌ని, బ్యాగ్ ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేయాల‌ని కోరారు స‌తీష్ రెడ్డి(Satheesh Reddy ). భార‌త దేశంలో అపార‌మైన వ‌న‌రులు, అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాటిని గుర్తించి స‌ద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్ర‌ధానంగా గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ‌గా అన్ని రంగాల‌లో రాణిస్తున్నార‌ని యువ‌త‌ను ప్ర‌శంసించారు. ఇందులో భాగంగా 60 వేల‌కు పైగా స్టార్ట‌ప్ లు ప్రారంభం కావ‌డం సాధించిన అభివృద్దికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు స‌తీష్ రెడ్డి.

అంతే కాకుండా స్టార్ట‌ప్ లు ప్రారంభించాల‌ని అనుకునే వాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి తోడ్పాటు అంద‌జేస్తుంద‌ని చెప్పారు డీఆర్డీఏ చైర్మ‌న్ డి. స‌తీష్ రెడ్డి.

Also Read : ఫేస్ బుక్ పై ర‌ష్యా ఆంక్ష‌లు

Leave A Reply

Your Email Id will not be published!