Russia Restricts FB : ఫేస్ బుక్ పై ర‌ష్యా ఆంక్ష‌లు

ప‌ట్టించు కోబోమ‌న్న సంస్థ

Russia Restricts FB  : ప్ర‌స్తుత ప్ర‌పంచం విస్తు పోయేలా ర‌ష్యా చీఫ్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్దాన్ని ప్ర‌క‌టించ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించు కోలేక పోతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ సామాన్య పౌరుల‌ను చంపుకుంటూ పోవ‌డాన్ని గ‌ర్హిస్తున్నారు.

తీవ్రంగా నిర‌సిస్తున్నారు. ప్ర‌త్యేకించి ర‌ష్యాలో సైతం ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్ష దాడుల‌ను నిలిపి వేయాల‌ని, చ‌ర్చ‌ల ద్వారా సామ‌ర‌స్య పూర్వ‌కంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించు కోవాల‌ని సూచించింది ఐక్య రాజ్య స‌మితి.

మ‌రో వైపు అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ ,తదిత‌ర దేశాల‌న్నీ ఆర్థిక ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఈ త‌రుణంలో డోంట్ కేర్ అంటున్నారు పుతిన్.

అయితే ఉక్రెయిన్ పై దాడికి సంబంధించిన వీడియోలు, వార్త‌లు, ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ (Russia Restricts FB )చేస్తూ ఉండడంతో మ‌రింత ఇబ్బందిక‌రంగా మారాయి.

త‌మ‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చే వార్త‌ల‌ను, పోస్టుల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది ర‌ష్యా. ఇదే విష‌యాన్ని ఫేస్ బుక్ (Russia Restricts FB )కు కూడా స్ప‌ష్టం చేసింద‌ని ఆ సంస్థే ఇవాళ ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉందా లేదా లేక పోతే శిక్ష త‌ప్ప‌దంటూ వార్నింగ్ కూడా ఇచ్చింద‌ని పేర్కొంది.

మారుతున్న స‌మాజపు గొంతుక‌ను తాము వినిపిస్తూనే ఉంటామ‌ని ఫేస్ బుక్ ఈ సంద‌ర్భంగా మ‌రోసారి వెల్ల‌డించింది.

తాము ఎవ‌రి ప‌క్షం వ‌హించ‌మ‌ని వాస్త‌వాల‌ను నియంత్రించే సామ‌ర్థ్యం త‌మ‌కు ఉండ‌ద‌ని, కానీ ఎవ‌రి అభిప్రాయాలు వారు తెలియ చేసుకునే స్వేచ్ఛ‌నే తాము క‌ల్పిస్తున్నామంటూ పేర్కొంది ఫేస్ బుక్.

అయితే ర‌ష్యా నుంచి హెచ్చ‌రిక వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేనంటూ తెలిపింది.

Also Read : ఆనంద్ సుబ్ర‌మ‌ణియం అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!