Warren Buffet : డబ్బుతో ప్రేమను కాలాన్ని కొనలేం
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్
Warren Buffet : ఆయన ప్రపంచంలోనే టాప్ ధనవంతులలో ఒకడు. డబ్బుల్ని ఎలా సంపాదించాలో వారెన్ బఫెట్ (Warren Buffet )కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదంటే నమ్మలేం.
ఆయన వయస్సు ఇప్పుడు 91 ఏళ్లు. కానీ ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉంటారు. హాయిగా నవ్వుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలాన్ని గుర్తించడం, ప్రేమాస్పదతతో వ్యవహరించడం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానంటారు.
ఇప్పటికీ తన పనుల్ని తానే చేసుకుంటూ నిబద్దతకు, శ్రమకు నిర్వచనం చెబుతున్నారు. జీవితం ఒక్కసారే వస్తుంది. కాలం చాలా విలువైంది. అది డబ్బుకంటే ఎక్కువ అంటారు.
వేళ్ల మీద లెక్క పెట్ట గలిగే కుబేరులలో వారెన్ బఫెట్ వెరీ వెరీ డిఫరెంట్. ఆయన మాటలు, చేతలు ఒకేలాగా ఉంటాయి. ఎక్కడా తొట్రు పడకుండా జవాబు ఇవ్వడంలో తనకు తనే సాటి.
ఆ మధ్యన మరో ధనవంతుడైన బిల్ గేట్స్ భార్య మిలిందా విడాకులు తీసుకున్న సమయంలో వారిద్దరూ ఏర్పాటు చేసిన మిలిందా ఫౌండేషన్ ట్రస్టీ మెంబర్ గా ఉన్న పదవికి రాజీనామా చేశారు బఫెట్.
ఎందుకంటే ఎక్కడా పొరపాటు ఉండ కూడదు అంటారు. ఎక్కడా మచ్చ రాకుండా చూడాలని కోరుకుంటారు. అందుకే ఆయన వారెన్ బఫెట్ అయ్యారు. మనం ఇలా ఉండి పోయాం.
స్టాక్ మార్కెట్ లో అంతా డబ్బులు పోగుట్టుకుంటే మనోడు మాత్రం దానినే బేస్ చేసుకుని కోట్లు కొల్లగొట్టాడు. ఆయనకు వారసుడిగా చెప్పవచ్చు భారత్ కు చెందిన ఝుంఝున్ వాలా.
అతడు కూడా స్టాక్స్ మీదే పెట్టుబడి పెడతాడు. ఇదిలా ఉండగా సక్సెస్ కు నిర్వచనం చెప్పమని ఎవరో అడగితే బఫెట్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
ప్రేమను కాలాన్ని కొనలేమని వాటిని సంపాదించు కోవడమే అసలైన సక్సెస్ అని సెలవిచ్చారు.
Also Read : ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పందన