Karine Jean Pierre : వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా జీన్ పియర్
మొట్ట మొదటి నల్ల జాతీయ మహిళ ఎంపిక
Karine Jean Pierre : అమెరికా ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి నల్ల జాతీయులకు ఉన్నత పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ తదుపరి ప్రెస్ సెక్రటరీగా కరీన్ జీన్ పియర్( Karine Jean Pierre) ను నియమంచారు.
ఉన్నత స్థాయి పదవిని చేపట్టనున్న మొట్ట మొదటి నల్ల జాతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె నియామకాన్ని స్వయంగా ప్రెసిడెంట్ ప్రకటించడం విశేషం.
జెన్ ప్సాకీ తర్వాత యుఎస్ పరిపాలనలో ప్రజా ముఖంగా సేవలు అందిస్తున్న మొదటి నల్ల జాతి, స్వలింగ సంపర్కురాలిగా నిలిచారు. మే 13తో ప్సాకీ పదవీ కాలం పూర్తవుతుంది.
2021 జనవరిలో ఆమె జాయిన్ అయ్యారు. ఆమె స్థానంలో కరీన్ జీన్ పియర్ ( Karine Jean Pierre)బాధ్యతలు చేపడతారు. ఇదిలా ఉండగా జీన్ పియర్ బైడన్ పదవీ కాలం నుండి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పని చేశారు.
ఆమె ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వైట్ హౌస్ లో 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పని చేసింది. అంతే కాకుండా ప్రోగ్రెసివ్ అడ్వకేసీ గ్రూప్ అయిన మూవ్ ఆన్. ఓఆర్జీ కి చీఫ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ గా ఉన్నారు.
అమెరికా వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఉన్నతాధికారులు, కేబినెట్ సభ్యులు, న్యాయమూర్తులు ఉండేలా జాగ్రత్త పడ్డారు బైడెన్. శ్వేత జాతీయులు జనాభాలో 60 శాతం కంటే తక్కువగా ఉన్నారు.
కానీ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలలో వారు ఉన్నారు. కరీన్ ఈ కష్టతరమైన ఉద్యోగానికి అవసరమైన అనుభవం, ప్రతిభ, సమగ్రతను తీసుకు రావడమే కాకుండా అమెరికన్ ప్రజల తరపున బైడన్ – హారిస్ అడ్మినిస్ట్రేషన్ పని గురించి కమ్యూనికేట్ చేయడంలో నాయకత్వం పని చేస్తుందని ప్రకటనలో తెలిపారు.
Also Read : నకిలీ డిగ్రీలపై సర్వత్రా ఆందోళన