RP Singh Malik : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ( ఐపీఎల్) 2022లో మోస్ట్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డ్ సష్టించాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్. ఇప్పటి వరకు గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతుల్ని వేసి చరిత్ర సృష్టించాడు.
వికెట్లను తీయడంలో ఇంకా పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ నిఖంజ్.
ప్రపంచ క్రికెట్ లో రాణించాలన్నా, పట్టు సాధించాలన్నా ముందుగా కావాల్సింది పట్టు కోల్పోకుండా బంతుల్ని వేయడం నేర్చు కోవాలని సూచించాడు.
ఇదే సమయంలో ఐపీఎల్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు దుమ్ము రేపారు. ప్రధానంగా టార్గెట్ తో ఉమ్రాన్ మాలిక్ ను దంచి కొట్టారు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ప్రధానంగా ఆసిస్ స్టార్ ఒకప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, రోవ్ మాన్ పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎక్కడా తొట్రు పడకుండా ఫోర్లు, సిక్సర్లు బాదారు.
దాంతో ఉమ్రాన్ మాలిక్ ఇంకా పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ ఆర్పీ సింగ్(RP Singh Malik ). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
పేస్ ఒక్కటే బౌలర్ ను రక్షించదని పేర్కొన్నాడు. ఎవరికి ఎలాంటి బంతులు వేయాలో ఉమ్రాన్ మాలిక్ అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇప్పటి వరకు 13 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. 150 కిలోమీటర్ల వేగంతో కేవలం 15 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ తన నైపుణ్యాలను మరింత పెంచు కోవాలని సూచించాడు ఆర్పీ సింగ్.
Also Read : డేవిడ్ వార్నర్ వరల్డ్ రికార్డ్