Harbhajan Singh : ఆ ఇద్దరు స్పిన్నర్లు అద్భుతం – భజ్జీ
చాహాల్..కుల్దీప్ పై కీలక కామెంట్స్
Harbhajan Singh : భారత జట్టు మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ సభ్యుడు హర్బజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రధానంగా 15వ ఐపీఎల్ సీజన్ లో వెటరన్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహాల్ , కుల్దీప్ యాదవ్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహాల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు.
ఇక కుల్దీప్ యాదవ్ 18 వికెట్లు సాధించి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి స్పిన్నర్లు భారత క్రికెట్ జట్టుకు అత్యంత అవసరమని , ఆసిస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లో కీలకంగా మారనున్నారని హర్బజన్ సింగ్ అలియాస్ భజ్జీ(Harbhajan Singh) స్పష్టం చేశాడు.
కొన్నేళ్ల పాటు వీరిద్దరూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నమోదు చేసిన విజయాలలో కీలకంగా మారారని పేర్కొన్నాడు.
ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ కోల్పోవడం ఖాయమని అంత మాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నాడు భజ్జీ. 2019 నుంచి చాహాల్, కుల్దీప్ ఫామ్ కోల్పోయారు.
ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ లీగ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారని వీరిద్దరిని తిరిగి టీమిండియాకు ఎంపిక చేయాలని సూచించాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh).
ఇదిలా ఉండగా భజ్జీ డ్రీమ్ సెట్ గో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
Also Read : పేస్ ఒక్కటే అంతిమం కాదు – ఆర్పీ సింగ్