Avesh Khan : అవేశ్ ఖాన్ దెబ్బకు ఠారెత్తిన కోల్ కతా
4 ఓవర్లు 19 పరుగులు 3 వికెట్లు
Avesh Khan : లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు చుక్కలు చూపించారు లక్నో బౌలర్లు కోల్ కతా నైట్ రైడర్స్ కు. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటారు.
ప్రధానంగా ఆవేశ్ ఖాన్ , జేసన్ హోల్డర్ కోల్ కతా పతనాన్ని శాసించారు. ప్రధానంగా అవేశ్ ఖాన్ కళ్లు చెదిరేలా బంతుల్ని వేసి విస్తు పోయేలా చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇక 179 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు అవేశ్ ఖాన్(Avesh Khan).
4 ఓవర్లు వేసిన అవేశ్ ఖాన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఇక జేసన్ హోల్డర్ సైతం 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్ దెబ్బకు కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించాడు.
అవేశ్ ఖాన్ ది స్వస్థలం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్. జనవరి 13 డిసెంబర్ 1996లో పుట్టాడు. వయసు 25 ఏళ్లు. కుడి చేతి బ్యాటర్ , రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 20 ఫిబ్రవరి 2022 లో వెస్టిండీస్ తో టీ20 మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు అవేశ్ ఖాన్(Avesh Khan).
చివరి టీ20 శ్రీలంకతో ఆడాఉ. 2017లో మధ్య ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. అదే ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 2018 నుంచి 2021 దాకా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహొంచాడు.
2022లో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో లంక సూపర్ జెయింట్స్ మేనేజ్ మెంట్ చేజిక్కించుకుంది అవేశ్ ఖాన్ ను(Avesh Khan).
Also Read : రస్సెల్ విధ్వంసం తప్పని పరాజయం