Yuvraj Singh : కెప్టెన్ కాకుండా కుట్ర ప‌న్నారు

మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కామెంట్

Yuvraj Singh : భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. తాను కెరీర్ ప‌రంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని వాపోయాడు. 2007, ట‌20, 2011 వ‌న్డే జ‌ట్టులో యువీ ఆడాడు.

భార‌త జ‌ట్టు సాధించిన అనేక విజ‌యాల‌లో యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) కీల‌క పాత్ర పోషించాడు. బ్యాట‌ర్ గా రాణించాడు. బౌలర్ గా స‌త్తా చాటాడు. ఎన్నో రికార్డుల నెల‌కొల్పాడు. కొన్నాళ్ల పాటు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.

కానీ పూర్తి కాల‌పు నాయ‌కుడిగా ప‌ని చేయలేదు. తాజాగా యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) నాయ‌క‌త్వం ద‌క్క‌క పోవ‌డంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ క్రికెట‌ర్ మంజ్రేక‌ర్ తో మాట్లాడాడు. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.

కొంద‌రు నిర్వాకం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌న్నాడు. ఇంకొంద‌రు త‌న‌పై ప‌గ బ‌ట్టార‌ని అందుకే తాను భార‌త క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్ కాలేక పోయాన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ప్ర‌స్తుతం యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) చేసిన కామెంట్స్ బీసీసీఐలో, క్రికెట్ వ‌ర్గాల‌లో క‌ల‌కలం రేపుతున్నాయి. గ్రెగ్ చాపెల్ ఉదంతం అప్ప‌టికే బోర్డును, జ‌ట్టును కుదిపేసింది.

ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌పై స‌చిన్ , గంగూలీ త‌ప్పు ప‌ట్టారు. 2007లో భాగంగా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ కు ముందు బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను మార్చ‌డంపై కొంత ఇబ్బందిక‌రంగా మార్చేసింది.

ఓపెన‌ర్ గా ఉన్న స‌చిన్ ను మిడిల్ ఆర్డ‌ర్ లో ఆడించ‌డం, గంగూలీతో విభేదాలు , ఘోర వైఫ్య‌లం ఇవ‌న్నీ జ‌ట్టు ఓడి పోయేందుకు కీల‌కంగా మారింద‌న్నాడు. ఇదే వ్య‌వ‌హారం త‌న‌ను కెప్టెన్సీ నుంచి దూరం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

 

Also Read : ర‌ఫ్పాడించిన య‌శ‌స్వి జైస్వాల్

Leave A Reply

Your Email Id will not be published!