Jyotiraditya Scindia : ఇండిగో బోర్డింగ్ పై సింధియా ఆరా
దివ్యాంగులకు నో పర్మిషన్
Jyotiraditya Scindia : ఇండిగో ఎయిర్ లైన్స్ పై సీరియస్ అయ్యారు కేంద్ర విమానయాన సంస్థ శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). దేశ వ్యాప్తంగా సదరు సంస్థ బోర్డింగ్ సంబంధించి చోటు చేసుకున్న ఘటన చర్చకు దారి తీసింది.
ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు) కలిగిన చిన్నారులను వారాంతంలో రాంచీ విమానాశ్రయం నుంచి ఎక్కేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.
దీంతో ఇండిగోకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం వైరల్ గా మారింది. ఆ సంస్థ పై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.
ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారిని వారాంతంలో రాంచీ ఎయిర్ పోర్టులో తన కుటుంబంతో కలిసి విమానం ఎక్కేందుకు అనుమతించక పోవడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
దీంతో స్వయంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యా(Jyotiraditya Scindia) సింధియా రంగంలోకి దిగారు. ప్రయాణికుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే కాదు ఈ విషయంపై విచారణకు ఆదేశించామన్నారు సింధియా.
విచారణ రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రకటంచారు ఏంద్ర మంత్రి. ఈ విషయం గురించి సింధియా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా ఇండిగోను నివేదిక కోరింది. పెద్ద రాద్దాంతం చెలరేగడంతో ఇండిగో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ప్రయాణికుల సెక్యూరిటీ దృష్ట్యా ఈనెల 7న ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడు తన కుటుంబంతో కలిసి ఫ్లైట్ ఎక్కలేక పోయాడని పేర్కొంది.
ఇంత జరిగినా ఆ కుటుంబం సహనం కోల్పోదేని తోటి ప్రయాణికురాలు తెలిపింది.
Also Read : కర్ణాటక సీఎంపై సిద్దరామయ్య ఫైర్