Rahul Dravid : భారత క్రికెట జట్టు మాజీ కెప్టెన్ , భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మెగా ఈవెంట్ లో పాల్గొననున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ ఆధ్వర్వంలో నిర్వహించే యువ మోర్చా సదస్సుకు హాజరు కానున్నారు.
ఈ విషయాన్ని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే వెల్లడించారు. యువత విభిన్న రంగాల్లో రాణించాలనే సందేశాన్ని ఇస్తారని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు.
ఈనెల 12 నుంచి 15 వరకు ధర్మశాలలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రత్యేక అతిథిగా పాల్గొంటారని బీజేపీ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియో వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ బాధ్యులు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు. మూడు రోజుల సెషన్ లో సీఎం జై రామ్ ఠాకూర్ కూడా పాల్గొంటారని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 139 మంది ప్రతినిధులు సెషన్ లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ద్రవిడ్ ఎన్నో విజయాలలో పాలు పంచుకున్నాడు.
భారత క్రికెట్ లో ఇప్పుడు కీలకంగా మారారు. యువ ఆటగాళ్లను తయారు చేయడంలో తీవ్రంగా కృషి చేశాడు. తాజాగా ఆయన టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నారు.
రాజకీయ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో సైతం రాణించేందుకు యువతకు మార్గదర్శనం చేస్తారని తెలిపారు ఎమ్మెల్యే.
ఇదిలా ఉండగా ద్రవిడ్ ఉన్నతమైన పదవిలో ఉండి పార్టీ మీటింగ్ కు అటెండ్ కావడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : తిప్పేసిన జస్ప్రీత్ బుమ్రా