Srilanka Crisis : క‌నిపిస్తే కాల్చేయండి – శ్రీ‌లంక చీఫ్

ఆదేశాలు జారీ చేసిన రాజ‌ప‌క్సే

Srilanka Crisis : ద్వీప దేశం శ్రీ‌లంక అట్టుడుకుతోంది. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతోంది. ఇప్ప‌టికే దాడుల‌తో అధికార పార్టీకి చెందిన ఎంపీ కాల్పుల‌కు తెగ బ‌డ‌డంతో చంపేశారు.

ఇదే స‌మ‌యంలో ఎంపీ , మాజీ మంత్రి ఇళ్ల‌కు నిప్పు పెట్టారు. దేశ ప్ర‌ధాన మంత్రి మ‌హింద రాజ‌ప‌క్సే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఆయ‌న మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న‌కారుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు.

పెద్ద ఎత్తున అల్ల‌ర్లు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురికి పైగా మ‌ర‌ణించారు. 220 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచున ఆ దేశం త‌ల్ల‌డిల్లుతోంది. ఇదే త‌రుణంలో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొంది. ఈ త‌రుణంలో ప్రెసిడెంట్ శ్రీ‌లంక మిల‌ట‌రీకి, పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

అత్య‌వ‌స‌ర అధికారాన్ని అప్ప‌గించింది ప్ర‌స్తుత ప్ర‌భుత్వం. తాజాగా తీవ్రంగా హెచ్చ‌రించింది. ఆస్తుల‌ను ధ్వంసం చేసినా, ఇత‌రుల‌పై దాడుల‌కు తెగ బ‌డినా, చంపేందుకు ప్ర‌య‌త్నం చేసినా కాల్చేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ వ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది. తాత్కాలిక స‌ర్కార్ ఆర్డ‌ర్ మేర‌కు సైన్యం, పోలీస్ శాఖ మైకుల ద్వారా టాం టాం చేస్తున్నారు.

అంతే కాదు ఎవ‌రినైనా స‌రే వారెంట్ లేకుండానే అదుపులోకి తీసుకునే ప‌వ‌ర్స్ కూడా ఇచ్చింది తాత్కాలిక ప్ర‌భుత్వం. పెద్ద ఎత్తున వీధుల్లోకి వ‌చ్చిన ఆందోళ‌న‌కారులు, నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు.

ప్ర‌జ‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని అధ్య‌క్షుడు కోరారు. ప్ర‌ధానంగా ప్ర‌ధానిని టార్గెట్ చేశారు. ఆయ‌న అనుచ‌రుల‌పై దాడుల‌కు తెగ బ‌డుతున్నారు. మ‌హీంద ఎక్క‌డికీ పారి పోకుండా ప్ర‌జ‌లు కాప‌లా కాస్తున్నారు.

 

Also Read : మేం క‌న్నెర్ర చేస్తే నాటో నాశ‌న‌మే

Leave A Reply

Your Email Id will not be published!