GT vs LSG IPL 2022 : గుజరాత్ దర్జాగా ప్లే ఆఫ్స్
సత్తా చాటిన గిల్, రషీద్ ఖాన్
GT vs LSG IPL 2022 : దిగ్గజ జట్లకు షాక్ ఇస్తూ ఊహించని రీతిలో ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు దర్జాగా చేరుకుంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ . కోచ ఆశిష్ నెహ్రా సారథ్యంలో ఈ జట్టు అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకు పోతోంది.
అటు బ్యాటింగ్ లో తక్కువ స్కోరే చేసినప్పటికీ బలమైన లక్నో జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ దుమ్ము రేపాడు.
హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇక బౌలింగ్ పరంగా ఆఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కళ్లు చెదిరే బంతులతో తిప్పేశాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు.
ఇక ఫుల్ ఫామ్ మీద ఉన్న కెఎల్ రాహుల్ ను మహ్మద్ షమీ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. విచిత్రం ఏమిటంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో ఉన్న లక్నో(GT vs LSG IPL 2022) గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు.
కానీ ఏ ఒక్క ఆటగాడు ఎదుర్కోలేక చేతులెత్తేశారు. రన్స్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. హోరా హోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. తిరుగులేని ప్రదర్శనతో దుమ్ము రేపిన గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
షఫీ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుంటే అద్భుతమైన బంతులతో మెస్మరైజ్ చేశాడు రషీద్ ఖాన్. ఇక శుభ్ మన్ గిల్ 49 బంతులు ఎదుర్కొని 63 పరుగులు చేశాడు.
ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. ఆఖరులో వచ్చిన రాహుల్ తెవాటియా 16 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 22 రన్స చేసి నాటౌట్ గా ఉన్ఆనడు. లక్నో(GT vs LSG IPL 2022) బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, మోహిసిన్ ఖాన్ , హోల్డర్ చెరో వికెట్ తీశారు.
Also Read : చెలరేగిన గుజరాత్ చేతులెత్తేసిన లక్నో