Shubman Gill : స‌త్తా చాటిన శుభ్ మ‌న్ గిల్

49 బంతులు 63 నాటౌట్

Shubman Gill : ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ మ‌రోసారి స‌త్తా చాటింది. ఈ రిచ్ టోర్నీలో ప్లే ఆఫ్స్ కు మొద‌టిసారిగా ఎంట్రీ లోనే ప్లే ఆఫ్స్ చేరుకుని స‌త్తా చాటింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 144 ప‌రుగులు చేసింది. చూస్తే త‌క్కువ స్కోర్ కానీ ల‌క్నో జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. గుజ‌రాత్. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ర‌షీద్ ఖాన్ ఇద్ద‌రూ అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ఖాన్ 4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు తీసి మ‌రోసారి త‌న విలువేంటో చెప్పాడు. ల‌క్నో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఎంచుకున్న ఆట‌గాళ్లు అంచ‌నాల‌కు మించి ప‌ర్ ఫార్మెన్స్ ఇస్తూ స‌త్తా చాటుతున్నారు.

అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్నారు గుజ‌రాత్ ఆటగాళ్లు. ఇదిలా ఉండ‌గా రిచ్ లీగ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్ లు ఆడింది. 9 మ్యాచ్ ల‌లో గెలుపొంది 18 పాయింట్లు సాధించింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఇక ప్లే ఆఫ్స్ కు మూడు జ‌ట్లు చేరుకోవాల్సి ఉంది. ఇందులో ఏ జ‌ట్లు వ‌స్తాయ‌నే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటీ ప‌డుతున్నాయి.

మిగ‌తా జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే అన్ని మ్యాచ్ ల‌ను గెలుపొందాల్సి ఉంటుంది. ఇక ఆట విష‌యానికి వ‌స్తే గుజ‌రాత్ టైటాన్స్ చేసిన 144 ర‌న్స్ ల‌లో అత్య‌ధిక ప‌రుగులు ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ (Shubman Gill) దే. 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల‌లో 63 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

అత‌డితో పాటు రాహుల్ తెవాటియా 16 బంతులు ఆడి 4 ఫోర్ల‌తో 22 ర‌న్స్ చేశాడు.

 

Also Read : గుజ‌రాత్ ద‌ర్జాగా ప్లే ఆఫ్స్

Leave A Reply

Your Email Id will not be published!