Rashid Khan : అబ్బా రషీద్ ఖాన్ దెబ్బ
ఠారెత్తిన లక్నో సూపర్ జెయింట్స్
Rashid Khan : ఐపీఎల్ రిచ్ లీగ్ లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుందని అనుకున్న మ్యాచ్ తీరా చప్పగా ముగిసింది. ఇరు జట్లు తక్కువ స్కోర్ కే పరిమితమైనా చివరి వరకు ఆధిపత్యం మాత్రం గుజరాత్ దే మరోసారి రుజువు చేసుకుంది.
ఈ తరుణంలో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అంతా లక్నో సులభంగా గెలుస్తుందని ఆశించారు.
కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఒక్క దీపక్ హూడా తప్ప ఏ ఒక్కరు రెండెంకల స్కోర్ చేయలేక పోయారు. ఫుల్ ఫామ్ మీదున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ 8 పరుగులకే వెనుదిరిగాడు. మహమ్మద్ షమీ తన బాల్ తో బోల్తా కొట్టించాడు.
అతి తక్కువ పరుగులు ఇచ్చి కట్టడి చేశారు. ఇక ఆఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan) 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. ఇక టోర్నీలో పర్పుల్ క్యాప్ రేసులో టాప్ లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఉమ్రాన్ మాలిక్ తో పాటు రషీద్ ఖాన్(Rashid Khan) ఉన్నాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ తరుణంలో ఇంకా మూడు జట్లు ఏవి వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటి వరకు గుజరాత్ 12 మ్యాచ్ లు ఆడింది 9 మ్యాచ్ లలో విజయం సాధించింది మూడు మ్యాచ్ లలో ఓటమి మూటగట్టుకుంది. ఇక లక్నోతో పాటు రాజస్తాన్, ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్ , పంజాబ్ బరిలో ఉన్నాయి. ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.
Also Read : సత్తా చాటిన శుభ్ మన్ గిల్