RR vs DC IPL 2022 : ఢిల్లీ క్యాపిట‌ల్స్ టార్గెట్ 161

రాణించిన అశ్విన్..ప‌డిక్క‌ల్

RR vs DC IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారీ స్కోర్ చేయ‌కుండానే నిరాశ ప‌రిచింది సంజూ శాంస‌న్ సేన‌.

ఢిల్లీ క్యాపిట‌ల్స్(RR vs DC IPL 2022) స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజస్థాన్ 160 ప‌రుగులు చేసింది. ప్ర‌త్య‌ర్థి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందు 161 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ హిట్ట‌ర్ జోస్ బట్ల‌ర్ ను అద్భుత‌మైన బంతికి బోల్తా కొట్టించాడు చేత‌న్ స‌కారియా. కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద్భుతంగా ఆడాడు.

50 ప‌రుగులు చేయ‌గా దేవ‌దంత్ ప‌డిక‌ల్ రాణించాడు. గ‌త మ్యాచ్ లో దుమ్ము రేపిన య‌శ‌స్వి జైశ్వాల్ 19 ప‌రుగుల మాత్ర‌మే చేశాడు(RR vs DC IPL 2022). మ‌రోసారి నిరాశ ప‌రిచాడు సంజూ శాంస‌న్. ప‌డిక్క‌ల్ 48 ప‌రుగులు చేసి మేల‌నిపించాడు.

అశ్విన్ , ప‌డిక్క‌ల్ క‌లిసి అద్భుతైన షాట్స్ తో ఆక‌ట్టుకున్నారు. మిచెల్ మార్ష్ దెబ్బ‌కు అశ్విన్ వెనుదిరిగాడు. శాంస‌న్ 6 ప‌రుగుల‌కే ప‌రిమితం కాగా రియాన్ ప‌రాగ్ ఓ సిక్స్ కొట్టి 9 ర‌న్స్ చేసి నిరాశ ప‌రిచాడు.

హిట్మైర్ లేక పోవ‌డంతో అత‌డి స్థానంలో వ‌చ్చిన రాసీ వాన్ డ‌ర్ డ‌స్సెన్ 12 ప‌రుగులే చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నోర్ట్ జీ, స‌కారియా, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీసి త‌మ ఖాతాలో వేసుకున్నారు.

 

Also Read : పాట్ క‌మ్మిన్స్ పై ర‌విశాస్త్రి కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!