R Ashwin : అశ్విన్ మెరిసినా తప్పని ఓటమి
బ్యాటింగ్ లో జోరు బౌలింగ్ లో బేజారు
R Ashwin : ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ కోసం జరిగిన కీలక పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ నే విజయం వరించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. ఈజీ టార్గెట్ కావడంతో ఢిల్లీ ఆడుతూ పాడుతూ నెగ్గింది.
మొత్తం 12 మ్యాచ్ లు ఆడిన ఈ జట్టు ఆరు మ్యాచ్ లలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించ లేదు.
ఐపీఎల్ లో ఇప్పటి దాకా విధ్వంసకరమైన ఆటతో దుమ్ము రేపుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ 7 పరుగులకే వెనుదిరిగాడు.
చేతన్ సకారియా తన అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో రాజస్థాన్ పతనం ప్రారంభమైంది. బౌలర్ గా భారీ ధరకు తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 19 పరుగులకే చాప చుట్టేస్తే కెప్టెన్ సంజూ శాంసన్ నిర్లక్ష్యంగా తన వికెట్ ను పారేసుకున్నాడు.
ఇక రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) , దేవదత్ పడిక్కల్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. పడిక్కల్ 48 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 53 రన్స్ జోడించారు.
ఇదే లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ తో ఓడి పోయిన ఢిల్లీ ఈసారి గెలిచి కసి తీర్చుకుంది.
Also Read : దంచి కొట్టిన మిచెల్ మార్ష్