Shehbaz Sharif : జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యం పేరుతో లండన్ లోనే మకాం మార్చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్(Shehbaz Sharif) ను పాకిస్తాన్ ప్రధాన మంత్రి , సోదరుడైన షెహబాజ్ షరీఫ్ కలుసుకున్నారు.
మొట్ట మొదటిసారిగా పాకిస్తాన్ పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పర్యటించిన తొలి విదేశీ స్థలం లండన్ కావడం విశేషం.
ఇందులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , అహ్సాన్ ఇక్బాల్ , మర్రియం ఔరంగాజేబ్ లతో సహా పలువురు మంత్రులతో కూడిన బృందం లండన్ కు చేరుకుంది.
పాకిస్తాన్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలపై పార్టీ నాయకత్వానికి సంబంధించి నవాజ్ షరీఫ్ (Shehbaz Sharif)తో సంప్రదింపులు జరిపేందుకు పీఎం షెహబాజ్ షరీఫ్ వచ్చినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది.
ఈ సందర్భంగా పాకిస్తాన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ఒక రోజు ముందు లండన్ లో మీడియాతో మాట్లాడారు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్.
చాలా కాలం తర్వాత తన సోదరుడు భేటీ కాబోతున్నాడని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు . వారితో పాటు ఇతరులను కూడా కలిసేందుకు తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తనను తప్పించేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయంటూ ఆరోపించారు. ఈ తరుణంలో ఇప్పుడు పీఎం నవాజ్ షరీఫ్ ను కలవడం ఆయన చేసిన ఆరోపణలకు ఊతం ఇచ్చినట్లయింది.
Also Read : రిపోర్టర్ ను చంపేసిన ఇజ్రాయెల్ దళాలు