Sachin Pilot : ఎన్డీఏను ఢీకొనేందుకు కూట‌మి

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పైల‌ట్

Sachin Pilot : ఈ దేశంలో మ‌తం పేరుతో కులం పేరుతో రాజ‌కీయాలు చేస్తూ భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో కూట‌మి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆపార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైలట్(Sachin Pilot) వెల్ల‌డించారు.

శుక్ర‌వారం నుంచి మూడు రోజుల పాటు మేధో మ‌ధ‌న స‌దస్సు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నాయ‌కులు, ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు.

2024లో దేశంలో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కూట‌మి ప‌ని చేస్తుంద‌న్నారు. పార్టీ నిర్వ‌హించ బోయే చింత‌న్ శిబిరంపై దేశ వ్యాప్తంగా ఫోక‌స్ నెల‌కొంది.

ఏం నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి అనుస‌రించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఎలా పోరాటం చేయాల‌నే దానిపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు చెప్పారు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot).

ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన బీజేపీని ఢీకొనేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో లెక్క‌కు మించి స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు రోడ్లు, క‌ట్ట‌డాల పేర్లు మార్చ‌డం, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు పెంపొందించేలా మ‌త ప‌ర‌మైన అంశాల‌ను లేవ దీయ‌డం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot).

తాము పాల‌న చేత‌కాక గ‌తంలో ఏలిన పాల‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌ధాని మోదీ ప‌రివారానికి అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మండుతున్నాయ‌ని, నిత్యావ‌స‌రాలు కొండెక్కాయ‌ని కానీ మోదీ మాత్రం త‌న ప్ర‌చారంలో మునిగి పోయారంటూ ఎద్దేవా చేశారు.

 

Also Read : సీఈసీ చీఫ్ గా రాజీవ్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!