Sunil Gavaskar : పుజారా పునరాగ‌మ‌నంపై స‌న్నీ కామెంట్

కౌంటీ ఆడ‌టం వేరు టెస్టు మ్యాచ్ లు వేరు

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టెస్టు జ‌ట్టులో స్థానం కోల్పోయిన చ‌టేశ్వ‌ర పుజారా ప్ర‌స్తుతం ఇంగ్లండ్ లోని కౌంటీ మ్యాచ్ ల‌లో పాల్గొని స‌త్తా చాటుతున్నాడు.

తిరిగి టెస్టు జ‌ట్టులోకి పుజారా తిరిగి రాగ‌ల‌రా అన్న దానిపై స్పందించాడు స‌న్నీ. కౌంటీ ఆడ‌టం వేరు టెస్టు మ్యాచ్ ఆడటం వేరు అని స్ప‌ష్టం చేశారు. స‌సెక్స్ కు చెందిన కౌంటీ ఛాంపియ‌న్ షిప్ లో చెతేశ్వ‌ర్ పుజారా అద్భుత‌మైన ఫామ్ లో ఉన్నాడు.

అత‌డి తో పాటు పాకిస్తాన్ ఓపెన‌ర్ మ‌హ‌మ్మద్ రిజ్వాన్ తో క‌లిసి సూప‌ర్ గా ఆడుతూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో రెండు డ‌బుల్ సెంచ‌రీలు, రెండు సెంచ‌రీలు సాధించాడు.

అత‌ని గొప్ప ప్ర‌ద‌ర్శ‌న పుజారా భార‌త టెస్టు జ‌ట్టులోకి తిరిగి రావ‌డానికి సిద్దంగా ఉన్నాడ‌ని తాజా, మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇంకోసారి కోల్పోయిన స్థానం తిరిగి వ‌చ్చే చాన్స్ ఉంద‌న్నారు.

కొంత పేల‌వ‌మైన ఫామ్ త‌ర్వాత పుజారా శ్రీ‌లంక‌తో స్వ‌దేశంలో జ‌రిగే టెస్టు సీరీస్ కోసం భార‌త జ‌ట్టు నుంచి తొల‌గించ‌బ‌డ్డాడు. కాగా వ‌చ్చే జూలై 1 నుంచి ప్రారంభ‌మ‌య్యే ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తో భార‌త్ ఆడ‌నుంది.

గ‌త ఏడాది టీమిండియా 2-1 తో ఆధిక్యంలో ఉన్న సీరీస్ ను పూర్తి చేసింది. పుజారాను తిరిగి జ‌ట్టులోకి తీసుకు రావాల‌ని బీసీసీఐ ఆలోచిస్తుందా అన్న‌దే ఇప్పుడు పాయింట్.

ఈ సంద‌ర్బంగా కౌంటీ లో ఆడ‌టం ఈజీ అని టెస్టు లో ఆడ‌టం చాలా క‌ష్ట‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు సునీల్ గవాస్క‌ర్(Sunil Gavaskar).

 

Also Read : చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ

Leave A Reply

Your Email Id will not be published!