Faf Du Plessis : కోహ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం
ఆర్సీబీ కెప్టెన్ ప్లాఫ్ డుప్లిసిస్
Faf Du Plessis : గత కొంత కాలంగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి మద్దుతగా నిలిచాడు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ డుప్లెసిస్(Faf Du Plessis) .
ప్రపంచంలోని ఏ ఆట లోనైనా సరే ఆడే ఆటగాడు, అథ్లెట్ లు ఏదో ఒక రోజు ఫామ్ కోల్పోవడం అన్నది సర్వ సాధారణమని పేర్కొన్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు.
టాప్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడని కితాబు ఇచ్చాడు. తాను చూసిన అరుదైన ప్లేయర్లలో కోహ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో చెప్పుకో తగిన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు.
ఇక ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 టోర్నీలో అతి తక్కువ స్కోర్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఏదో ఒక రోజు తిరిగి తన ఆట తీరుతో మళ్లీ ఆకట్టుకుంటాడని డుప్లెసిస్(Faf Du Plessis) తెలిపాడు.
విచిత్రం ఏమిటంటే తేలికైన ఆటను ఆడాలని అనుకుంటున్నందుకే మెరుగైన రన్స్ చేయలేక పోతున్నాడని అభిప్రాయపడ్డాడు ఆర్సీబీ కెప్టెన్. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం చేసుకుంది. రాబోయే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
ఆఖరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఉంది. ఒక వేళ ఓడి పోతే ఇంటి బాట పట్టాల్సిందే.
Also Read : దినేష్ కార్తీక్ కు భజ్జీ సపోర్ట్