Andre Russell : చుక్కలు చూపించిన ఆండ్రీ రస్సెల్
49 పరుగులు 3 వికెట్లు తీసిన క్రికెటర్
Andre Russell : ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు అద్భుత విజయం దక్కింది. ఈ కీలక గెలుపులో జమైకా స్టార్ ఆండ్రీ రస్సెల్(Andre Russell)
కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటాడు.
కేకేఆర్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో 177 రన్స్ చేసి ఆరు వికెట్లు కోల్పోయి. రాణా 26, రహానే 28, సామ్స్ 34 పరుగులతో రాణించారు. ఆండ్రీ రస్సెల్ వచ్చీ రాగానే దంచి కొట్టడం స్టార్ట్ చేశాడు.
28 బంతులు ఎదుర్కొన్న రస్సెల్ 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు రస్సెల్(Andre Russell).
4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రస్సెల్ విషయానికి వస్తే. పూర్తి పేరు ఆండ్రీ డ్వేన్ రస్సెల్. 29 ఏప్రిల్ 1988లో పుట్టాడు.
ఇప్పుడు అతడి వయసు 34 ఏళ్లు. జమైకా లోని కింగ్స్ టన్ అతడి స్వస్థలం. ముద్దు పేరు డ్రే రస్(Andre Russell). 2010 నుంచి వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15 నవంబర్ 2010న శ్రీలంకతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.
11 మార్చి 2011లో ఐర్లాండ్ తో వన్డే మ్యాచ్ స్టార్ట్ చేశాడు. 21 ఏప్రిల్ 2011లో పాకిస్తాన్ తో టీ20 ఆడాడు. 2006 నుంచి 2007 వరకు జమైకాకు ఆడాడు..
2012 నుంచి 2013 దాకా ఢిల్లీ డేర్ డెవిల్స్ కు, 2013 నుంచి 2021 దకాఆ జమైకా తల్లా వాస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.
Also Read : తిప్పేసిన రస్సెల్ తలవంచిన హైదరాబాద్