Congress Chintan Shivir : కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ శ్రీకారం
ఒకే ఫ్యామిలీ ఒకే టికెట్..రాహుల్ పాదయాత్ర
Congress Chintan Shivir : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన నవ సంకల్ప్ చింతన్ శివిర్(Congress Chintan Shivir) లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు అంశాలను చర్చించిన అనంతరం ఒకే ఫ్యామిలీ ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.
త్వరలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి రాష్ట్రంలో 90 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టేందుకు తీర్మానం చేసింది.
ఎవరైనా సరే కాంగ్రెస్(Congress Chintan Shivir) పార్టీకి చెందిన నాయకుడు ఐదు ఏళ్ల పాటు ఒకే పోస్టులో ఉండేందుకు ఓకే చెప్పింది. ఒకవేళ అదే ఫ్యామిలీ నుంచి వస్తే మూడేళ్ల పాటు పని చేయాలని రూల్ విధించింది.
ప్రధానంగా పార్టీలో యువతకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కనీసం 50 శాతంకు పైగా వారి భాగస్వామ్యం ఉండేలా తీర్మానం చేసింది సీడబ్ల్యుసీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , మైనార్టీ మహిళలకు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని, బ్యాలట్ ద్వారా ఓటింగ్ చేపట్టేందుకు మొగ్గు చూపింది. సీడబ్ల్యుసీ తీర్మానం అనంతరం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ బీజేపీలో లేదన్నారు. తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం కాంగ్రెస్ ఇస్తోందన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాధ్యులు ఇళ్లల్లో కూర్చుంటే కాదు ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు.
లేక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : త్వరలో రాహుల్ గాంధీ పాదయాత్ర