Virender Sehwag : కెప్టెన్లలో కోహ్లీ కంటే గంగూలీ బెటర్
ఎంతో మంది ఆటగాళ్లను తీసుకు వచ్చాడు
Virender Sehwag : భారత మాజీ క్రికెటర్ , వివాదాస్పద కామెంటేటర్ గా పేరొందిన విరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇండియన్ క్రికెట్ లో ఎవరు అద్భుతమైన కెప్టెన్ అన్న ప్రశ్నకు వీరూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రధానంగా కోహ్లీ, గంగూలీలో ఎవరు ఉత్తమమైన నాయకుడు అంటే నిస్సందేహంగా తాను సౌరవ్ గంగూలీని పేర్కొంటానని చెప్పాడు. కోహ్లీ గొప్ప ఆటగాడిగా ఉన్నా తన టీంను ఏర్పాటు చేయలేక పోయాడని విమర్శించాడు.
కానీ సౌరవ్ గంగూలీ ఎంతో మందికి లిఫ్ట్ ఇచ్చాడని, ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా తనదైన మార్క్ ను చూపించాడని తెలిపాడు. విరాట్ కోహ్లీకి గంగూలీకి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నాడు.
కోహ్లీ, సౌరవ్ ఇద్దరూ తమ సొంత మార్గాల్లో అద్భుతంగా ఉన్నప్పటికీ కోహ్లీ ఎలాంటి ప్రయోగాలు చేయలేక పోయాడన్నాడు. గంగూలీ చేసిన పనిని ఏకతాటిపైకి తీసుకు రాలేక పోయాడని వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పష్టం చేశాడు.
స్పోర్ట్స్ 18 షో హోం ఆఫ్ సీరీస్ లో మాట్లాడాడు. తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టాడు. గణాంకాలు ఎన్ని ఉన్నప్పటికీ సౌరవ్ గంగూలీ మోస్ట్ సక్సెస్ ఫుల్, పాపులర్ కెప్టెన్ అని కితాబు ఇచ్చాడు.
బెంగాల్ దాదా కొత్త జట్టును నిర్మించాడు. కొత్త ఆటగాళ్లను తీసుకు వచ్చాడు. వారికి బేషరతుగా మద్దతు ఇస్తూ అండగా నిలిచాడు. అందుకే గంగూలీ బీసీసీఐకి బాస్ కాగలిగాడని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).
విరాట్ కోహ్లీ తన హయాంలో ఇలా చేశాడా అని ప్రశ్నించాడు.
Also Read : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత