Nikhat Zareen : మెరిసిన జరీన్ మురిసిన ఇందూరు
సత్తా చాటిన తెలంగాణ తేజం
Nikhat Zareen : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా గెలుపొంది దేశానికి గర్వ కారణంగా నిలిచిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఇక జరీన్(Nikhat Zareen) స్వంతూరు నిజామాబాద్ జిల్లా ఇందూరు. ప్రస్తుతం ఆమె వయస్సు 25 ఏళ్లు.
52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ ను 5-0 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఆమె పేరెంట్స్ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. నిజామాబాద్ లో ఇంటర్ పూర్తి చేసింది.
15 ఏళ్ల వయసు నుంచే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. మేరీకోమ్ ను ఆమె స్పూర్తిగా తీసుకుంది. ఏవీ కాలేజీలో చదువుతుండగా జలంధర్ లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ లెవల్లో పాల్గొని ఛాంపియన్ గా నిలిచింది.
2011లో ఉమెన్స్ యూత్ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్థం సాధించింది. ఇటీవల బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ పోటీల్లోనూ బంగారు పతకాన్ని సాధించింది.
వరుస విజయాలతో దూసుకు పోతున్న నిఖత్ జరీన్(Nikhat Zareen) తో ప్రముఖ స్పోర్ట్స్ తయారీ సంస్థ అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్ గా 2018లో ఒప్పందం చేసుకుంది. బెల్ గ్రేడ్ లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది.
2015లో అస్సాంలో నిర్వహించిన పోటీల్లో గోల్డ్ మెడల్ కొట్టింది. 2019లో థాయ్ లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లో సిల్వర్ మెడల్ సాధించింది.
నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్ గా నిలవడంతో ఇందూరు, నిజామాబాద్ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : తెలంగాణ బిడ్డ బాక్సింగ్ లో జగజ్జేత