Moeen Ali : మోయిన్ అలీ శివమెత్తినా తప్పని ఓటమి
ఇంటి బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
Moeen Ali : నిన్నటి దాకా కామ్ గా ఉన్న మోయిన్ అలీ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మొదట్లోనే వికెట్ ను కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ మోయిన్ అలీ(Moeen Ali) ఊగి పోయాడు. ఎక్కడ పడితే అక్కడ బంతుల్ని అలవోకగా బౌండరీ లైన్ దాటించాడు.
ఒకానొక దశలో చెన్నై స్కోర్ కనీసం 200 దాటుతుందని అనుకున్నారు. కానీ ఎక్కడా తొట్రు పాటుకు లోనుకాకుండా ప్రత్యర్థి జట్టును కట్టడి
చేయడంలో సక్సెస్ అయ్యాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.
నాలుగు సంవత్సరాల తర్వాత తన జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో
150 రన్స్ మాత్రమే చేసింది.
ఇందులో మోయిన్ అలీ చేసిన పరుగులు 93. ఇక చెన్నై కథ ముగిసింది. ఇంటి బాట పట్టింది. ఆ జట్టు 14 మ్యాచ్ లు ఆడి 10 మ్యాచ్ లలో
ఓడి పోయి 4 మ్యాచ్ లలో గెలుపొందింది.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే 15వ సీజన్ లీగ్ లో బరిలోకి దిగింది. కూల్ గా ప్లే ఆఫ్స్ కు చేరింది. మంగళవారం జరిగే
క్వాలిఫయర్ -1 లో గెలిస్తే ఓకే లేదా ఓడి పోయినా మరో ఛాన్స్ ఉంటుంది రాజస్తాన్ కు.
ఇక మోయిన్ అలీ(Moeen Ali) కేవలం 57 బంతులు మాత్రమే ఎదుర్కొని 13 ఫోర్లు 3 సిక్సర్లతో 93 రన్స్ చేశాడు. కెప్టెన్ ధోనీ 26 రన్స్ చేస్తే
కాన్వే 16 పరుగులతో నిరాశ పరిచారు.
యుజ్వేంద్ర చాహల్ , మెక్ కాయ్ చెరో వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి 151 రన్స్
చేసి గెలుపు సాధించింది.
Also Read : రసవత్తర పోరులో రాజస్తాన్ రాజసం