Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ అదుర్స్
23 బంతులు 2 ఫోర్లు 3 సిక్సర్లు 40 రన్స్
Ravichandran Ashwin : రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ , శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు భారత వెటరన్ క్రికెటర్ , ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13లలో జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో ఏరికోరి భారీ ధరకు తీసుకుంది. అటు బౌలర్ గా ఇటు బ్యాటర్ గా సత్తా చాటుతున్నాడు ఆర్. అశ్విన్. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన కీలక మ్యాచ్ లో తనదైన శైలిలో ఆడాడు.
టార్గెట్ చిన్నదే అయినప్పటికీ ఒకానొక దశలో కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అశ్విన్ 40 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికే హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు
ఈ రిచ్ టోర్నీలో. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు రవిచంద్రన్ అశ్విన్. మ్యాచ్ గెలుపొందిన తర్వాత అశ్విన్ అత్యంత ఆనందానికి లోనయ్యాడు.
ఆ మధుర క్షణాలను ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసింది. చివరి ఓవర్ దాకా ఈ మ్యాచ్ కొనసాగింది. కానీ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.
తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను రాజస్తాన్ రాయల్స్ వైపు తిప్పేలా చేశాడు. మొత్తంగా ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరింది దర్జాగా. నాలుగు సంవత్సరాల తర్వాత రాజస్తాన్ ప్లే ఆఫ్స్ కు చేరడం.
Also Read : సత్తా చాటిన పానీపూరి కుర్రాడు