MS Dhoni : వచ్చే ఐపీఎల్ లో చెన్నైకి నేనే కెప్టెన్
సంచలన ప్రకటన చేసిన ఎంఎస్ ధోనీ
MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన ప్రకటన చేశాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వచ్చే ఏడాది 2023లో జరిగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో సీఎస్కేకు తానే నాయకుడిగా ఉంటానని వెల్లడించాడు.
2021లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో సత్తా చాటడమే కాకుండా సీఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టాడు ధోనీ(MS Dhoni). కానీ ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 కలిసి రాలేదు ఈ స్టార్ ప్లేయర్ కు.
రిచ్ లీగ్ ప్రారంభం అవుతుందన్న ఒక్క రోజు ముందు సంచలన ప్రకటన చేశాడు ధోనీ. తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు డిక్లేర్ చేశాడు.
తన వారసుడు రవీంద్ర జడేజానేనంటూ వెల్లడించాడు. కానీ సీఎస్కేను గెలుపు బాటలో నడిపించడంలో జడ్డూ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఏమైందో ఏమో కానీ సీఎస్కే యాజమాన్యం మళ్లీ ధోనీకే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
కాగా ఈ ఐపీఎల్ లో 10 మ్యాచ్ లలో ఓడి పోయి 4 మ్యాచ్ లలో గెలుపొందింది. కీలకమైన ఆఖరి లీగ్ 14వ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో సీఎస్కే తలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో 151 రన్స్ చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. దర్జాగా ప్లే ఆఫ్స్ లో రెండో స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ ను ఆకాశానికి ఎత్తేశాడు ధోనీ(MS Dhoni). అతడి ఆల్ రౌండర్ షో ఆ జట్టుకు విజయాన్ని చేకూర్చేలా చేసిందన్నాడు.
Also Read : రవిచంద్రన్ అశ్విన్ అదుర్స్