RCB IPL 2022 : ఢిల్లీ దురదృష్టం బెంగళూరు అదృష్టం
ముంబై దెబ్బకు ప్లే ఆఫ్స్ కు దూరం
RCB IPL 2022 : అదృష్టం వరిస్తే ఏ దేవుడు కూడా ఆపలేడన్నది పాత సామెత. ఇది సరిగ్గా సరిపోతుంది పాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. (RCB IPL 2022) పాయింట్లు సాధించినా మెరుగైన రన్ రేట్ లేక పోవడంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లలేని పరిస్థితి ఆర్సీబీది.
కానీ ఒకే ఒక్క మ్యాచ్ ఆ జట్టు ఆశల్ని చిగురింప చేసింది. ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కసి ఇప్పుడు ఆ జట్టును ప్రేరేపిస్తోంది. ఇదే సమయంలో పాయింట్లు సాధించి,
ఆర్సీబీ కన్నా రన్ రేట్ ఎక్కువగా ఉన్నా కీలకమైన లీగ్ మ్యాచ్ లో చేజేతులారా ముంబై ఇండియన్స్(MI) జట్టుతో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. చిన్న పాటి నిర్ణయం ఒక్కోసారి మ్యాచ్ ను ప్రభావితం చేస్తుంది.
ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న, ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మ సేన ను తక్కువగా అంచనా వేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు గత సీజన్ లోనూ ఈ సీజన్ లోనూ తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇక నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగనుందని, ఎలాగైనా సరే ఢిల్లీని ఓడించి పోయిన పరువు నిలబెట్టు కోవాలని ముంబై డిసైడ్ అయ్యింది. దీనిని తక్కువగా అంచనా వేసింది ఢిల్లీ. చేజేతులారా గెలవాల్సిన మ్యాచ్ ను పోగొట్టుకుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ను, ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. ప్లే ఆఫ్స్ కు కష్టమని ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అయిన బెంగళూరును ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ ఢిల్లీని ఓడించి ప్లే ఆఫ్స్ కు చేర్చేలా చేసింది. లక్ , బ్యాడ్ లక్ మధ్య దూరం కొంత సేపే.
Also Read : తిప్పేసిన జస్ ప్రీత్ బుమ్రా