Shikhar Dhawan : ఐపీఎల్ లో అదరగొట్టినా పక్కన పెట్టారు
సత్తా చాటిన శిఖర్ ధావన్ కు బిగ్ షాక్
Shikhar Dhawan : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సఫారీ టీంతో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తో ఆడే ఏకైక 5వ టెస్టుకు కూడా జట్టును ప్రకటించారు.
ఈసారి ఊహించని రీతిలో పలువురు ఆటగాళ్లకు మళ్లీ చాన్స్ దక్కింది. వారిలో ఫినిషర్ దినేష్ కార్తీక్, దుమ్ము రేపిన హార్దిక్ పాండ్యాతో పాటు ఐపీఎల్ పర్పుల్ క్యాప్ రేసులో టాప్ లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కు కూడా ఛాన్స్ దక్కింది.
కానీ ఎవరూ ఊహించని విధంగా వెటరన్ స్టార్ ఓపెనర్ పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్(Shikhar Dhawan) కు మొండి చేయి చూపించింది. తాజా, మాజీ ఆటగాళ్లు ధావన్ కు చాన్స్ దక్కుతుందని భావించారు.
కానీ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దినేష్ కార్తీక్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఎందుకనో ఎంపిక చేయలేదు. దీంతో పలువురు ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు చేతన్ శర్మపై నిప్పులు చెరుగుతున్నారు.
శిఖర్ ధావన్ ఐపీఎల్ 2022లో అద్భుతంగా రాణించాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎలాంటి ఫామ్ లో లేని వెంకటేశ్ అయ్యర్ ను ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ 15వ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఏకంగా 421 పరుగులు చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగత ఆటగాళ్లలో ధావన్ ఒకడు.
Also Read : కార్తీక్ కష్టం వరించిన అదృష్టం