Rajathan Royals Flight : రాజస్తాన్ రాయల్స్ ఫైట్ లో గందరగోళం
వాతావరణ మార్పుతో తీవ్ర ఇబ్బంది
Rajathan Royals Flight : రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోల్ కతా లో భారీగా వర్షాలు పడడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ఐపీఎల్ 2022లో భాగంగా నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.
వాటిలో గుజరాత్ ఫస్ట్ లో ఉండగా రాజస్తాన్ రెండో స్థానంలో ఉంది. మంగళవారం ఇరు జట్లు క్వాలిఫయిర్ -1 ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు వేదికగా కోల్ కతా ను ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో ముంబై నుంచి రాజస్థాన్ రాయల్స్(Rajathan Royals Flight) ప్రత్యేక విమానంలో బయలు దేరింది.
వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడం, ఒక్కసారిగా పొగ మంచు వచ్చి చేరింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో వారంతా భయపడ్డారు.
విమానం దించాలంటూ గట్టిగా కేకలు కూడా వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్(Rajathan Royals Flight) తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కొద్ది సేపు అయ్యాక పొగమంచు మొత్తం పూర్తి గా తొలగి పోవడంతో ఫ్లైట్ లో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక హల్లా బోల్ అంటూ నినాదాలు చేశారు.
ఈ వీడియోలో యశస్వి జైశ్వాల్, సిమ్రోన్ హిట్ మైర్ ఉన్నారు. మొత్తం మీద బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం రాజస్థాన్ పాలిట శాపంగా మారిందన్నది వాస్తవం.
Also Read : ఆర్సీబీకి పరోక్షంగా పంత్ సపోర్ట్