Rashid Khan Chahal : నేస్త‌మా ఇద్ద‌రి లోకం ఒక్క‌టే

మైదానంలో ర‌షీద్ ఖాన్..చాహ‌ల్

Rashid Khan Chahal : కోల్ క‌తా ఈడెన్ గార్డెన్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫ‌యిర్ -1లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఆట‌లో ప్ర‌త్య‌ర్థులైనా ముగిశాక తామంతా ఒక్క‌టేన‌న్న క్రీడా స్పూర్తిని చాటుకున్నారు ర‌షీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహ‌ల్(Rashid Khan Chahal).

ఈసారి ఐపీఎల్ లో వీరిద్ద‌రూ అద్భుతంగా రాణించారు. కొన్నేళ్ల పాటు ప్రాతినిధ్యం వ‌హించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు గుడ్ బై చెప్పిన ర‌షీద్ ఖాన్(Rashid Khan Chahal) ఈసారి కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ కు మారాడు.

అత‌డిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది గుజ‌రాత్ యాజ‌మాన్యం. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కీల‌క‌మైన వికెట్లు తీస్తు, ప్ర‌త్య‌ర్థుల‌కు ప‌రుగులు ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేస్తూ అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో జ‌ట్టును గెలిపించాడు ర‌షీద్ ఖాన్.

ఇక ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తా చాటాడు ఈసారి. మ‌రో క్రికెట‌ర్ స్టార్ స్పిన్న‌ర్ గా పేరొందాడు యుజ్వేంద్ర చాహ‌ల్. ఐపీఎల్ 2022లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డు రేసులో ఉన్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చాహ‌ల్.

ఈసారి ఐపీఎల్ వేలం పాట‌లో అత‌డిని ఏరికోరి ఎంచుకుంది రాజ‌స్తాన్ యాజ‌మాన్యం. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 26 వికెట్లు తీశాడు. స‌త్తా చాటాడు.

టాప్ లో ఉన్నాడు. మ్యాచ్ ముగిశాక మైదానంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ర‌షీద్ ఖాన్ , చాహ‌ల్ ఆలింగ‌నం చేసుకున్నారు. ఆట‌కు కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేద‌ని నిరూపించారు. క్రీడా స్పూర్తిని చాటారు.

Also Read : డేవిడ్ మిల్ల‌ర్ షాన్ దార్ కిల్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!