MK Stalin : కేంద్ర స‌ర్కార్ పై స్టాలిన్ సీరియ‌స్

రాష్ట్రాల హ‌క్కులు హ‌రిస్తోంది

MK Stalin : కేంద్ర, రాష్ట్రాల మ‌ధ్య మ‌రింత అగాధం పెరుగుతోంది. అయిన దానికి కాని దానికి క‌య్యానికి కాలు దువ్వుతోంది కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం.

రెండో సారి గెలిచిన త‌ర్వాత బీజేపీయేత‌ర రాష్ట్రాలు, వ్య‌క్తులు, సంస్థ‌లు,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను, విప‌క్షాల‌ను, నాయ‌కుల‌ను, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, వారికి స‌పోర్ట్ చేసిన వ్యాపార‌వేత్త‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

ఒకే పార్టీ ఒకే దేశం ఒకే భాష నినాదంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ముందుకు తీసుకు రావ‌డాన్ని ఆయా రాష్ట్రాలు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి. ఇటీవ‌ల కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా భాష విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు క‌ర్ణాట‌క మాజీ సీఎంలు సిద్ద రామ‌య్య‌, హెచ్ డి కుమార స్వామి. వీరితో పాటు త‌మిళ‌నాడు స‌ర్కార్ మొద‌టి నుంచీ కేంద్రం నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌డుతోంది.

అమిత షా కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీకి చెందిన త‌మిళ‌నాడు చీఫ్ అన్నామ‌లై. దీంతో ఒక్క‌సారిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఖంగుతిన్న‌ది.

ఇదిలా ఉండ‌గా తాజాగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌ను కోర‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin).

ఆర్థిక అంశాలు, ప‌న్ను విధింపున‌కు సంబంధించి రాష్ట్రాల‌కు ఉన్న హ‌క్కుల‌ను హ‌రిస్తూ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తోందంటూ కేంద్ర స‌ర్కార్ పై మండిప‌డ్డారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 21, 761 కోట్ల బ‌కాయిలు ఇంకా రావాల్సి ఉంద‌ని ఇప్ప‌టి దాకా మంజూరు చేయ‌లేద‌ని ఆరోపించారు.

Also Read : టైమ్ ప్ర‌భావ‌శీల వ్య‌క్తుల్లో అదానీ..క‌రుణ

Leave A Reply

Your Email Id will not be published!