Tuba Hassan : చరిత్ర సృష్టించిన తుబా హసన్
పాక్ లెగ్ స్పిన్నర్ ఘనత
Tuba Hassan : పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ తుబా హసన్ అరుదైన ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్ లో చరిత్ర సృష్టించింది. వచ్చీ రావడంతోనే టీ20 మ్యాచ్ లో 4 ఓవర్లు వేసింది. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది.
కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన తుబా హసన్ మూడు కీలక వికెట్లు తీసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసింది తుబా హసన్(Tuba Hassan). తొలి మ్యాచ్ లోనే బెస్ట్ స్పెల్ నమోదు చేసిన మహిళా బౌలర్ గా ఘనత స్వంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తుబా హసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది.
ఈ మేరకు ఓ సూపర్ క్యాప్షన్ కూడా జత చేసింది పీసీబీ. ఇటీవలి కాలంలో ఇంతటి అద్భుతమైన బౌలింగ్ ను చూసిన దాఖలాలు లేవని పేర్కొంది. మరింతగా రాణించాలని కోరింది.
నీ బౌలింగ్ వర్దమాన మహిళా క్రికెటర్లకు , యువ క్రీడాకారిణులకు స్పూర్తి కలిగిస్తుందటూ పేర్కొంది పీసీబీ. తుబా హసన్(Tuba Hassan) వీడియోను, ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాను తుబా హసన్ హల్ చల్ చేస్తోంది. ఇక మ్యాచ్ పరంగా చూస్తే శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 రన్స్ చేసింది.
తుబా హసన్ , అమిన్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక పాకిస్తాన్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేశారు.
Also Read : పాకిస్తాన్ లో పెట్రోల్..డబ్బులకు కటకట