US Hits Twitter : ట్విట్టర్ కు భారీ జరిమానా
రూ. 1,163 కోట్లు ఫైన్ కట్టాలి
US Hits Twitter : ఈ ఏడాది అంతగా కలిసి వచ్చినట్టు అనిపించడం లేదు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్బిట్టర్ కు. గోప్యత, భద్రత అన్నది అత్యంత ముఖ్యం.
దీనిని పాటించడంలో ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్ , లింక్డ్ ఇన్, గూగుల్ , యూట్యూబ్ , ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ , టెలిగ్రామ్, తదితర సంస్థలన్నీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వస్తున్నాయి.
యూజర్లే ఆయా సామాజిక మాధ్యమాలకు కాసులు కురిపిస్తున్నాయి. యాడ్స్ రూపంలో కోట్లు కొల్ల గొడుతున్నాయి. ఇదే విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి ఈ కంపెనీలు.
ఇప్పటికే యూజర్ల భద్రత , గోప్యత పాటించడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ తో పాటు ఇతర
సంస్థలు సరైన ప్రమాణాలు పాటించడం లేదని, ఎన్నికల సమయంలో ఆయా సంస్థలు విలువైన డేటాను విక్రయిస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఫేస్ బుక్ వీటిని ఎదుర్కొంది. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్న ప్రముఖ ప్రపంచ కుబేరుడు టెస్లా సిఇఓ ఎలోన్
మస్క్ మెలిక పెట్టాడు.
స్పామ్, పని చేయని ఖాతాలు ఎన్ని ఉన్నాయో తనకు కావాలని పట్టు పట్టాడు. దీనిపై క్లారిటి ఇచ్చే ప్రయత్నం ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ చేసినా మస్క్ ఒప్పు కోవడం లేదు.
ఇదే సమయంలో అమెరికా(US Hits Twitter) కోర్టు ఏకంగా రూ. 1,163 కోట్లు ఫైన్ గా చెల్లించాలని ఆదేశించడం పెను సంచలనం రేపింది.
ట్విట్టర్ 2013 మే నుంచి 2019 సెప్టెంబర్ మధ్య యూజర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్ తో పాటు ఇతర సమాచారాన్ని ప్రకటనదారులకు
ఇచ్చిందనే ఆరోపణల మీద యూఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ , ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేపట్టాయి సంయుక్తంగా.
విచారణ జరిపాక యూజర్ల డేటాను కాపాడటంలో ట్విట్టర్ విఫలమైందని నిర్ధారించింది. ఈ మేరకు రూ. 150 మిలియన్ డాలర్లు ఫైన్ విధించింది.
Also Read : టెక్నాలజీ విప్లవం జాగ్రత్త అవసరం