Gautam Gambhir Rahul : గౌతం గంభీర్ రాహుల్ ఫోటో వైర‌ల్

ఆర్సీబీతో ల‌క్నో ఓట‌మిపై హెడ్ కోచ్ ఫైర్

Gautam Gambhir Rahul : ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. 14 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 8 వికెట్లు కోల్పోయి 198 ర‌న్స్ మాత్ర‌మే చేసి చేతులెత్తేసింది.

దీంతో ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ నుంచి నిష్క్ర‌మించింది. ఇంటి బాట ప‌ట్టింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్ వుడ్, హ‌ర్ష‌ల్ ప‌టేల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్ర‌త్యేకించి చెప్పు కోవాల్సింది ఏమిటంటే ఈసారి ఐపీఎల్ 15వ సీజ‌న్ లో రెండు కొత్త జ‌ట్లు చేరాయి.

ఒక‌టి గుజ‌రాత్ టైటాన్స్ కాగా రెండోది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ఈ రెండు జ‌ట్లు అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాయి. దిగ్గ‌జ జ‌ట్ల‌కు షాక్ ఇచ్చాయి. ప్లే ఆఫ్స్ కు చేరిన ల‌క్నో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి చేరింది.

దీంతో ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో అదృష్టం వ‌రించి ఆర్సీబీ గెలుపు సాధించింది. ప్ర‌ధానంగా ల‌క్నో ఆట‌గాళ్లు చెత్త ఫీల్డింగ్ చేయ‌డంతో బెంగ‌ళూరు బ్యాట‌ర్లు రెచ్చి పోయి ఆడారు.

కెప్టెన్ కేఎల్ రాహుల్, దీప‌క్ హూడా, వోహ్రా మూడు క్యాచుల్ని చేతికి వ‌చ్చినా వ‌దిలి వేశారు. దీంతో ర‌జ‌త్ పాటిదార్ 112 ర‌న్స్ చేస్తే దినేశ్ కార్తీక్ 37 ప‌రుగులు చేసి స‌త్తా చాటారు.

ఈ త‌రుణంలో మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ రాహుల్(Gautam Gambhir Rahul)  పై గ‌రం గ‌రం అయ్యాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir). మ‌నోడికి ఓట‌మి అంటే ప‌డ‌దు. ప్ర‌స్తుతం గంభీర్, రాహుల్(Rahul) ఫోటో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : శాంస‌న్ చేయ‌లేనిది పాటిదార్ చేశాడు

Leave A Reply

Your Email Id will not be published!