Dinesh Karthik : ఐపీఎల్ రూల్ ను ఉల్లంఘించిన దినేష్ కార్తీక్

కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అతిక్ర‌మ‌ణ

Dinesh Karthik : రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఫినిష‌ర్ గా పేరొందిన వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించాడు.

ఇందుకు గాను దినేశ్ కార్తీక్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ క‌మిటీ. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ఐపీఎల్ అధికారిక మీడియా వెల్ల‌డించింది.

కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో బుధ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడింది. ఈ గేమ్ లో ఆర్సీబీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ మ్యాచ్ సంద‌ర్భంగా మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. ఆఖ‌రున వ‌చ్చిన దినేష్ కార్తీక్ 37 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్ లోనే ఆర్సీబీ ఆట‌గాడు కార్తీక్ ఐపీఎల్ రూల్ ను అతిక్ర‌మించాడ‌ని పేర్కొంది. తాజాగా క్వాలిఫ‌యిర్ -2 మ్యాచ్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో ఇవాళ అహ్మ‌దాబాద్ వేదిక‌గా మోదీ స్టేడియంలో ఆడ‌నుంది ఆర్సీబీ.

దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియామావ‌ళి లోని ఆర్టిక‌ల్ 2.3 ప్ర‌కారం లెవ‌ల్ 1 నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు ఐపీఎల్ వెల్ల‌డించింది.

కాగా లెవ‌ల్ -1 ఉల్లంఘ‌న‌కు సంబంధించి దినేష్ కార్తీక్ కు శిక్ష ఏమిట‌నేది మ్యాచ్ రిఫ‌రీ నిర్ణ‌య‌మే అంతిమ‌మ‌ని ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ క‌మిటీ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

Also Read : ఆర్సీబీ ఆయుధం బౌలింగ్ బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!