Rajat Patidar : ప‌టిదార్ రాణించినా త‌ప్ప‌ని ఓట‌మి

42 బంతులు 4 ఫోర్లు 3 సిక్స్ లు 58 ర‌న్స్

Rajat Patidar : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన క్వాలిఫ‌యిర్ -2 లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి పోయి ముందుగా

బ్యాటింగ్ చేసింది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.

ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. స్టార్ ప్లేయ‌ర్ల‌ను బోల్తా కొట్టించారు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బౌల‌ర్లు.

గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో పేల‌వ‌మైన బౌలింగ్ తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఆ బౌల‌ర్లే బెంగ‌ళూరుకు చుక్క‌లు చూపించారు. ఒకానొక

ద‌శ‌లో డిఫెన్స్ ఆడేందుకు ట్రై చేశారు.

బెంగ‌ళూరు జ‌ట్టులో మ‌రోసారి మెరిశాడు మ‌ధ్య ప్ర‌దేశ్ కుర్రాడు ర‌జ‌త్ పటిదార్(Rajat Patidar). కేవ‌లం 42 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని

58 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

ర‌జ‌త్ టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు. అనుకోని అదృష్టం త‌లుపు త‌ట్టింది ముంబై ఇండియ‌న్స్ రూపంలో

ఆర్సీబీకి. ఒక వేళ ఢిల్లీ క్యాపిట‌ల్ ఓడి పోయి ఉండ‌క పోతే ఆ జ‌ట్టే ప్లే ఆఫ్స్ కు చేరేది.

ఇక టైటిల్ గెల‌వాల‌న్న ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ . క‌లిసి క‌ట్టుగా స్పూర్తి దాయ‌క‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించారు. ఈ మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది.

ఒక ర‌కంగా చెప్పాలంటే జోస్ బ‌ట్ల‌ర్ ది ఈ మ్యాచ్. రాజ‌స్తాన్ బౌల‌ర్లు చ‌క్క‌గా రాణించారు. ప్ర‌సిద్ద్ క్రిష్ణ 3 వికెట్లు తీస్తే మెక్ కాయ్ 3 తీశాడు. ఆర్. అశ్విన్ 1 వికెట్ తీస్తే యుజ్వేంద్ర చాహ‌ల్ ఈసారి కూడా రాణించ లేక పోయాడు.

మ‌రోసారి నిరాశ ప‌రిచాడు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ. ప్ర‌సిద్ద్ క్రిష్ణ అద్భుత‌మైన బంతిని ఆడ‌బోయి శాంస‌న్ కు దొరికి పోయాడు. కెప్టెన్ డుప్లెసిస్ 27 బంతులు ఆడి 25 ర‌న్స్ చేశాడు.

మెరిపిస్తాడ‌ని అనుకున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆశించినంత‌గా రాణించ లేదు. ఇక దినేశ్ కార్తీక్ కూడా నిరాశ ప‌రిచాడు.

Also Read : రాజ‌స్తాన్ రాజ‌సం బెంగ‌ళూరు ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!