India Slams : ఇస్లామిక్ గ్రూప్ నేష‌న్స్ కు భార‌త్ వార్నింగ్

జీవిత ఖైదుపై అర‌బ్ దేశాలు గ‌గ్గోలు

India Slams : ఉగ్ర‌వాదుల‌కు నిధులు స‌మ‌కూర్చిన కేసులో జీవిత ఖైదు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు పై ప్ర‌పంచానికి చెందిన ఇస్లామిక్ గ్రూప్ సంస్థ దేశాలు త‌ప్పు ప‌ట్ట‌డాన్ని భార‌త(India Slams) ప్ర‌భుత్వం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

ప్ర‌పంచానికి ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన ఉగ్ర‌వాదాన్ని తాము ఎట్టి ప‌రిస్ఙ‌తుల్లో స‌హించ బోమంటూ హెచ్చ‌రించారు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ దేశం స‌పోర్ట్ చేసినా ఊరుకోబోమంటూ స్ప‌ష్టం చేసింది.

మాలిక్ పై వెలువ‌రించిన తీర్పుపై కామెంట్స్ చేసే హ‌క్కు ఇస్లామిక్ దేశాల‌కు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌మ దేశ‌పు సార్వ భౌమ‌త్వాన్ని లేదా ఇత‌ర ఏ విష‌యాల గురించి జోక్యం చేసుకున్నా స‌హించ బోమంటూ వార్నింగ్ ఇచ్చింది.

హింస‌ను ప్రేరేపిస్తూ ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకున్న తీవ్ర‌వాది యాసిన్ మాలిక్ చేసిన దురాగ‌తాల‌కు ఉరి శిక్షే క‌రెక్టు అని పేర్కొంది. ద‌య‌త‌లిచి ప్ర‌త్యేక కోర్టు జీవిత ఖైదు విధించింద‌ని తెలిపింది.

1994 వ‌ర‌కు తాను హింస‌కు స‌పోర్ట్ చేశాన‌ని, త‌ప్పు తెలుసుకుని ఆ త‌ర్వాతి నుంచి గాంధీ మార్గాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు కోర్టులో యాసిన్ మాలిక్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు న్యాయ‌మూర్తి తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

గాంధీ పేరు వాడుకున్నంత మాత్రాన ఎవ‌రూ అహింసా వాదులుగా మార‌ర‌ని స్ప‌ష్టం చేశారు. యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు క‌రెక్టు అని చెప్పారు. కాగా మాలిక్ శిక్ష విధించ‌డాన్ని అభ్యంత‌రం తెలిపాయి ఇస్లామిక్ దేశాలు.

ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్థించ‌వ‌ద్దంటూ ఓఐసీని భార‌త్ కోరింది. మాలిక్ ఉగ్ర‌వాద కార్యక‌లాపాల‌కు సంబంధించిన డాక్యుమెంట్ ను కోర్టులో హాజ‌రు ప‌ర్చిన‌ట్లు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి తెలిపారు.

Also Read : న‌వాబ్ మాలిక్ చెప్పిందే జ‌రిగింది

Leave A Reply

Your Email Id will not be published!