Hardik Pandya IPL 2022 : హార్దిక్ పాండ్యాకు అగ్ని పరీక్ష
పీఎల్ 2022 ఫైనల్ పోరుకు సిద్దం
Hardik Pandya IPL 2022 : గత రెండు నెలలుగా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 చివరి దశకు చేరింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఆదివారం ఫైనల్ జరగనుంది.
15వ రిచ్ లీగ్ సెషన్ లో టైటిల్ గెలిచి విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, అద్భుతంగా రాణించి ఆ తర్వాత గాయాల పాలై , పూర్ పర్ ఫార్మెన్స్ తో ఉన్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya IPL 2022) కు ఐపీఎల్ పరంగా అరుదైన ఛాన్స్ దక్కించింది.
ఎవరూ ఊహించని రీతిలో తాజా, మాజీ ఆటగాళ్లు సైతం విస్తు పోయేలా గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పాండ్యాను ఏరికోరి ఎంచుకుంది.
ఆ మేరకు మాజీ దిగ్గజ ప్లేయర్ ఆశిష్ నెహ్రాకు కోచ్ గా ఎంపిక చేసి..పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతా విస్తు పోయారు.
కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా గుజరాత్ టైటాన్స్ ను తానే ముందుండి నడిపిస్తూ ఏకంగా తొలిసారిగా ఎంట్రీ ఇస్తూనే ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు పాండ్యా(Hardik Pandya IPL 2022).
ఒక రకంగా ఇది అద్భుతమని చెప్పక తప్పదు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో , ఫీల్డింగ్ లో ..కెప్టెన్ గా సత్తా చాటాడు పాండ్యా. తన కెప్టెన్సీలో టైటిల్ గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన వ్యక్తిగా నిలుస్తాడు.
వరుస విజయాలు సాధించి ఫైనల్ కు చేరిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హార్దిక్ పాండ్యా. తాను గత రెండేళ్లలో ఎంతో నేర్చుకున్నట్లు చెప్పాడు. గతం ఏమిటో తెలుసని, నేల విడిచి సాము చేయనని చెప్పాడు.
Also Read : రాజస్తాన్ ఆశలన్నీ బట్లర్ పైనే