Shoib Akhtar : వార్న్ కోస‌మైనా ఆ జ‌ట్టు గెల‌వాలి

మ‌న‌సేమో గుజ‌రాత్ ను కోరుకుంటోంది

Shoib Akhtar : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్, స్టార్ బౌల‌ర్ గా పేరొందిన షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. స్పోర్ట్స్ క్రీడాతో మాట్లాడాడు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

ల‌క్షా 10 వేల మందికి పైగా గేమ్ చూసేందుకు రానున్నాయి. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ఇది పేరొందింది. ఇక 14 ఏళ్ల త‌ర్వాత సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్స్ కు చేరింది.

ఇక కొత్త‌గా ఈసారి ఐపీఎల్ లో అడుగు పెట్టిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ ఎలాగైనా స‌రే క‌ప్పు కొట్టాల‌ని చూస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ఆడితే రాజ‌స్తాన్ ఆ జ‌ట్టు చేతిలో ఓడి పోయింది.

ఈ సంద‌ర్భంగా ఈ ఫైన‌ల్ లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై కీల‌క కామెంట్స్ చేశాడు షోయ‌బ్ అక్త‌ర్. ఇరు జ‌ట్ల‌కు స‌మాన అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ త‌న మ‌న‌సు మాత్రం గుజ‌రాత్ టైటాన్స్ గెలుస్తుంద‌ని పేర్కొన్నాడు.

కాక పోతే త‌న ఫ్రెండ్ , దివంగ‌త ఆసిస్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ కోస‌మైనా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించాల‌ని కోరాడు. ఈ గెలుపు అత‌డికి ఇచ్చే అస‌లైన నివాళిగా పేర్కొన్నాడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్.

ఆ జ‌ట్టు ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కొని ఫైన‌ల్ దాకా వ‌చ్చింద‌ని రాజ‌స్తాన్ గురించి తెలిపాడు. మొత్తంగా షోయ‌బ్ అక్త‌ర్(Shoib Akhtar) వ్యాఖ్య‌లు మాత్రం గుజ‌రాత్ టైటాన్స్ కు ఐపీఎల్ గెలుపొందే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

ఇదే స‌మ‌యంలో మాథ్యూ హేడ‌న్, సురేష్ రైనా సైతం ఐపీఎల్ లో ఇరు జ‌ట్ల‌కు ఛాన్స్ ఉంద‌ని పేర్కొన్నారు.

Also Read : చ‌రిత్ర సృష్టించిన సూప‌ర్ నోవాస్

Leave A Reply

Your Email Id will not be published!