Hardik Pandya IPL 2022 : పడి లేచిన కెరటం పాండ్యా
సానుకూల దృక్ఫథం సక్సెస్ కు కారణం
Hardik Pandya IPL 2022 : విజయానికి దగ్గరి దారులంటూ ఉండవు. నాయకుడు అన్న వాడు ఎలా ఉండాలో చేసి చూపించాడు గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా. గత రెండేళ్లుగా అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఎక్కడా తగ్గ లేదు.
తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్న తరుణంలో తన భార్య, కుటుంబం ప్రత్యేకించి సోదరుడు కృనాల్ పాండ్యా , సహచరులు అందించిన తోడ్పాటు మరిచి పోలేనంటాడు.
జీవితంలో కష్టాలు, కన్నీళ్లు సహజమే. ఆటలో గెలుపు ఓటములు కూడా ఉంటాయన్న నిజాన్ని నేను గ్రహించాను. ఇదే సమయంలో గాయం కావడం వల్ల ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆటే సర్వస్వంగా భావించిన నాకు పూర్ పర్ పర్ ఫార్మెన్స్ కొంచెం ఇబ్బంది కలిగించేలా చేసిందన్నాడు. విచిత్రం ఏమిటంటే గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఎవరూ ఊహించని రీతిలో పిలిచి మరీ అద్భుత అవకాశాన్ని ఇచ్చింది హార్దిక్ పాండ్యా(Hardik Pandya IPL 2022) కు.
ఏకంగా జట్టులో ఆటగాడిగా చాన్స్ దక్కుతుందని భావించాడు. కానీ జట్టుకు కెప్టెన్ గా ప్రకటించింది. ఆ తర్వాత జట్టుకు హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా వచ్చాడు. గతం అంతా మరిచి పోయాడు పాండ్యా.
ఇంకేం దెబ్బ తిన్న పులిలా తన శక్తి యుక్తుల్ని కేంద్రీకరించాడు. దిగ్గజ టీం లకు చుక్కలు చూపించాడు. తాను ఎవరి దగ్గరైతే ఆడాడో వారందరి నుంచి ఎన్నో నేర్చుకున్నానని ఈ సందర్భంగా చెప్పాడు.
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను ఉదహరించాడు. మొత్తంగా రియల్ ఛాంపియన్ గా జట్టును తీర్చి దిద్దాడు. తానే ముందుండి నడిపించాడు. ఫైనల్ లో 3 వికెట్లు తీశాడు.
అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా పాండ్యా(Hardik Pandya IPL 2022) రియల్ హీరోనని చెప్పక తప్పదు.
Also Read : గుజరాత్ జైత్రయాత్ర ఐపీఎల్ జగజ్జేత