Sanju Samson : మా జట్టును చూస్తే గర్వంగా ఉంది – శాంసన్
ఐపీఎల్ ఫైనల్ లో ఓటమి అనంతరం కామెంట్
Sanju Samson : ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ తో ఓటమి పాలైంది రాజస్తాన్ రాయల్స్ . మ్యాచ్ అనంతరం హర్ష బోగ్లేతో మాట్లాడాడు కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson). ఈ ఐపీఎల్ మాకు ప్రత్యేకమైనది.
మేం ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగాం. సమిష్టి కృషితో విజయాలు సాధించాం. కొన్ని తప్పుల వల్ల ఓటమి పాలయ్యాం. మాపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టును ప్రత్యేకంగా అభినందిస్తున్నా.
వాళ్లు ఈ టైటిల్ సాధించేందుకు నిజమైన అర్హులు కూడా. అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఇదే సమయంలో ఈ సీజన్ మా జట్టుకు ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు.
సీనియర్లు, జూనియర్లు సహకరించారు. ప్రత్యేకించి చెప్పు కోవాల్సింది స్టార్ హిట్టర్ జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్ . వాళ్లు జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించారని కితాబు ఇచ్చాడు.
మా జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని చెప్పాడు సంజూ శాంసన్(Sanju Samson). ప్రత్యేకించి చెప్పు కోవాల్సింది మాత్రం జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర, బౌలింగ్ కోచ్ లసిత్ మళింగతో పాటు రాజస్తాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ ను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.
గెలుపు ఓటములు సహజం. వచ్చే ఐపీఎల్ సీజన్ లో మేం మరింత రాణించగలమనే నమ్మకం తమకు ఉందన్నాడు. ఇక జట్టులోని ప్రతి ఆటగాడి ప్రయత్నం ఇందులో ఉందన్నాడు.
గెలిచి క్రికెట్ దివంగత దిగ్గజం షేన్ వార్న్ కు నివాళి ఇద్దామని అనుకున్నామన్నాడు. ఏది ఏమైనా ఈ లీగ్ తమకు గొప్పగా గుర్తుండి పోతుందన్నాడు శాంసన్.
Also Read : గుజరాత్ టైటాన్స్ రియల్ చాంపియన్స్