KS Eshwarappa : దేశంలో మా జెండా ఎగరడం ఖాయం
కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్
KS Eshwarappa : దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిత్యం వార్తల్లో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత వేడి పుట్టిస్తున్నారు.
యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి అయితే శ్రీరాముడు, శ్రీకృష్ణు, శివుడి వల్లే భారత దేశం ప్రపంచంలో గ్లోబల్ గురుగా ఏర్పడిందని, లేక పోతే దేశానికి పేరు వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా కర్ణాటక వివాదాలకు కేంద్రంగా మారింది. ఇటీవలే ఆ రాష్ట్రంలో హిజాబ్ వివాదం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది.
తాజాగా ఇదే రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాత్మకంగా మారారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కామెంట్ చేయడం, తిరిగి తాను అలా అనలేదని చెప్పడం అలవాటుగా మారింది.
కేఎస్ ఈశ్వరప్ప తాజాగా భారత దేశం ఆత్మ గౌరవానికి ప్రతీకంగా భావించే మువ్వొన్నల పతాకం (జాతీయ జెండా) పై కామెంట్స్ చేశారు. ఈ దేశంలో ఏదో ఒక రోజు త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు.
దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ మాజీ మంత్రి ఏకంగా కాషాయ జెండాకు ఉన్న చరిత్ర ఏమిటో, దాని వెనుక కథ ఏమిటో కూడా తెలియ చేశారు.
కాగా జాతీయ జెండాను కూడా గౌరవిస్తామని కానీ తమ పార్టీకి చెందిన కాషాయ జెండా ఎగరడం మాత్రం ఎవరూ అడ్డు కోలేరన్నారు.
Also Read : గవర్నర్ ఆదేశం అభిషేక్ ఆగ్రహం