Sonia Rahul Gandhi : సోనియా..రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి
Sonia Rahul Gandhi : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా(Sonia) గాంధీ, తనయుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది.
పీఎంఎల్ఏ క్రిమినల్ సెక్షన్ల కింద వారి స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని ఈడీ చూస్తోంది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న తమ ముందు హాజరు కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Sonia Rahul Gandhi) లకు ఈడీ సమన్లు పంపింది.
కాగా ఈడీ సమన్లను గౌరవించాలని, ఎలాంటి ఆలస్యం చేయకూడదని లేదా వాయిదా వేయరాదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇది రాజకీయ, సామాజిక, ఆర్థిక, న్యాయ పోరాటం అని పార్టీ స్పష్టం చేసింది. ఈడీ జారీ చేసిన సమన్ల వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కుదిపి వేసింది. కలకలం రేపింది.
కాగా పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బుధవారం మీడియాతో మాట్లాడారు. మనీ లాండరింగ్ లేదా మనీ మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు సంఘ్వి. డబ్బు మార్పిడి జరగ లేదని, జీతాలు మొదలైన బకాయిలను చెల్లించేందుకు రుణాన్ని ఈక్విటీగా మార్చడం మాత్రమే జరిగిందని పార్టీ ఎత్తి చూపింది.
Also Read : లాలూ రాజకీయ వారసుడు తేజస్వినే