KCR Anounce : నిఖ‌త్ జ‌రీన్..ఇషా సింగ్ కు న‌జ‌రానా

ఒక్కొక్క‌రికి రూ. 2 కోట్ల న‌గ‌దు ఇంటి స్థ‌లం

KCR Anounce : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న మొద‌టి నుంచీ కళాకారులు, క‌వులు, క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు.

గ‌తంలో త‌న ప్ర‌తిభా పాట‌వాల‌తో అంత‌ర్జాతీయ ప‌రంగా పేరొందిన ష‌ట్ల‌ర్ పీవీ సింధుకు కూడా న‌జ‌రానా ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఏపీ స‌ర్కార్ సైతం భారీ న‌గ‌దు ప్ర‌క‌టించింది.

ఇదే స‌మ‌యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్స‌ర్ నిఖ‌త్ జరీన్ , షూట‌ర్ ఇషా సింగ్ ల‌కు ఊహించ‌ని రీతిలో భారీ బ‌హుమతి ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

బుధ‌వారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కు రూ. 2 కోట్లు ప్ర‌క‌టించ‌గా , షూట‌ర్ ఇషా సింగ్ కు కూడా రూ. 2 కోట్ల న‌గ‌దు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించి స‌ర్కార్.

అంతే కాకుండా వారి పంట పండింది కూడా. భారీ న‌గ‌దు పుర‌స్కారంతో పాటు ఇంటి స్థ‌లం కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇదిలా ఉండ‌గా తాజాగా ప్ర‌పంచ మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్ లో స్వ‌ర్ణం గెలిచి చ‌రిత్ర సృష్టించింది నిఖ‌త్ జ‌రీన్.

మేరీ కోమ్ త‌ర్వాత బంగారు ప‌త‌కాన్ని గెలిచిన ఐదో మ‌హిళా బాక్స‌ర్ గా అరుదైన ఘ‌న‌త సాధించింది. ఐదో మ‌హిళా బాక్సింగ్ ఛాంపియ‌న్ గా నిలిచింది.

ఇదే స‌మ‌యంలో ఐఎస్ఎస్ఎఫ్ జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్ షూటంగ్ పోటీల్లో ఈషా సింగ్ బంగారు ప‌త‌కాన్ని సాధించింది. సీఎం కేసీఆర్(KCR Anounce) ఆదేశాల మేర‌కు జ‌రీన్, ఈషా సింగ్ కు రూ. 2 కోట్ల న‌గ‌దు, ఇంటి స్థ‌లం ఇస్తున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ఇద్ద‌రి క్రీడాకారుల‌కు బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ ల‌లో నివాస స్థ‌లం ఇవ్వ‌నుంది.

Also Read : కిన్నెర మొగుల‌య్య‌కు లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!