LPG Ujjwala : ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ షాక్
రాయితీ సౌలభ్యం ఉజ్వల లబ్దిదారులకే
LPG Ujjwala : కేంద్రంలోని మోదీ సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కోలుకోలేకుండా చేస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ..కాస్తంత తగ్గిస్తూ పొంతన లేని ప్రకటనలు చేస్తూ వస్తోంది.
ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు అంతకంతకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికి కాస్తంత తగ్గించింది కేంద్రం.
ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్, గ్యాస్ కంపెనీలపై పూర్తి పట్టును కోల్పోయింది మోదీ ప్రభుత్వం. ఇష్టానుసారంగా పెంచుకుంటూ వినియోగదారులపై ఎడా పెడా ధరలు పెంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఇదిలా ఉండగా ఎల్పీజీ(LPG) ఉపయోగిస్తున్న వారందరికీ శుభ వార్త చెప్పింది. మొన్న రూ. 200 చొప్పున రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. తీరా చావు కబురు చెప్పింది మెల్లగా.
అదేమిటంటే ఆ వెంటనే వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉజ్వల(LPG Ujjwala) పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు పొందిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందంటూ ప్రకటించింది కేంద్రం.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్. దేశంలోని 9 కోట్ల మంది పేద మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,003 గా ఉంది ఉజ్వల్ కింద రూ. 200 రాయితీ పోను రూ. 803కి లభిస్తుంది.
Also Read : పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయం – సీఎం