Coco Gauff : తుపాకులు కాదు శాంతి కావాలి – కోగో గౌఫ్

అతి పిన్న వ‌య‌సులో గ్రాండ్ స్లామ్ ఫైన‌లిస్ట్

Coco Gauff : మ‌న‌కు కావాల్సింది తుపాకులు, తూటాలు కాదు. కావాల్సింది శాంతి మాత్ర‌మే. అదే మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. అదే మ‌న‌ల్ని కాపాడుతుంది. అది లేకుండా ఈ ప్ర‌పంచం ముందుకు వెళ్ల‌లేదు.

ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్ కు చేరుకున్న అత్యంత పిన్న వ‌య‌స్సు క‌లిగి చ‌రిత్ర సృష్టించిన కోకో గౌఫ్(Coco Gauff). ఆమె వ‌య‌సు కేవ‌లం 18 ఏళ్లు. ఎంతో ప‌రిణ‌తి చెందిన వ్య‌క్తి కంటే గొప్ప‌గా మాట్లాడింది.

గ్రాండ్ స్లామ్ ఫైన‌లిస్ట్ గా నిలిచిన అనంత‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. యునైటెడ్ స్టేట్స్ లో వ‌రుస‌గా కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. ఇవాళ దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ సైతం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇంకెంత కాలం ఈ మార‌ణ‌హోమాన్ని భ‌రిద్దామంటూ ప్ర‌శ్నించారు. ఈ త‌రుణంలో కోగో గౌఫ్(Coco Gauff) చేసిన వ్యాఖ్య‌లు యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేశాయి. తూటాల వ‌ల్ల జీవితాలు ధ్వంసం అవుతాయి.

కానీ క‌లిసి ఉండ‌డం వ‌ల్ల కొత్త ప్ర‌పంచాన్ని నిర్మించ గ‌ల‌మ‌ని పేర్కొన్నారు కోగో గౌఫ్‌. అమెరికాలో భారీ కాల్పుల‌పై చ‌ర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేసేందుకు త‌న మైలు రాయి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఉప‌యోగించుకుంది.

కోర్ట్ సైడ్ టీవీ కెమెరాలో శాంతి తుపాకి హింసకు ముగింపు అని రాయ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. ఆలోచింప చేసేలా చేసింది కోకో గౌఫ్‌. సామూహిక కాల్పుల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసింది ఆమె.

18 ఏళ్ల అమెరిక‌న్ స్టార్ గాఫ్ త‌న సెమీ ఫైన‌ల్ లో మార్టినా ట్రెవిస‌న్ ను 6-3 , 6-1తో ఓడించింది. చరిత్ర సృష్టించింది. ఆమె ఫైన‌ల్ లో ఇగా స్విటెక్ తో త‌ల‌ప‌డ‌నుంది.

Also Read : భార‌త్ దెబ్బ ఆసిస్ అబ్బా – వ‌సీం జాఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!