Amit Shah : ఆర్మీ చీఫ్ ..ధోవల్ తో అమిత్ షా భేటీ
కాశ్మీర్ వరుస హత్యలపై ప్రధాన చర్చ
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా శుక్రవారం భారత అత్యున్నత భద్రతా దళాధిపతితో భేటీ అయ్యారు. కాశ్మీర్ లో వరుసగా కాల్పులకు ఉగ్రవాదులు పాల్పడుతుండడంపై ప్రత్యేకంగా చర్చించారు.
ఆర్మీ చీఫ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ కుమార్ సిన్హా కూడా హాజరయ్యారు.
ఈ అత్యవసర సమావేశం ఢిల్లీలో జరిగింది. మరో వైపు కాశ్మీర్ పండి, హిందూ టీచర్, బ్యాంక్ మేనేజర్ తో పాటు తాజాగా ఇటుక బట్టీలో పని చేస్తున్న బీహార్ కు చెందిన వలస కూలీని కాల్చి చంపారు ఉగ్రవాదులు. దీనిని నిరసిస్తూ జనం రోడ్డెక్కారు.
తమను జమ్మూకు పంపించాలని కోరారు. ఈ తరుణంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అమిత్ షా(Amit Shah) సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేవలం పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అంతే కాకుండా ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనం పై కూడా దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
మరో వైపు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ , ఆర్మీ చీఫ్, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన ఉన్నతాధికారులతో అమిత్ షా రౌండ్ ల వారీగా సమావేశాలు నిర్వహించారు.
ఈ ప్రాంతంలో ఒక్క వారంలో 8 మంది కాల్పులకు గురయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను ప్రత్యేకంగా పిలిపించారు ఢిల్లీకి.
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే , బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ , ఇతర ఏజెన్సీల చీఫ్ లు హాజరయ్యారు. ఈ అత్యవసర భేటీలో ప్రధానంగా కాశ్మీర్ కాల్పులపై చర్చ జరిగింది.
Also Read : చంపావత్ ఉప ఎన్నికలో సీఎం విక్టరీ